ఎన్నికల సంవత్సరం దగ్గర పడుతున్నకొద్దీ చంద్రబాబులో ఉలికిపాటు కూడా పెరిగిపోతూ ఉంది. దేశంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది అని మూడున్నరేళ్ళుగా మాయమాటలతో కాలం వెళ్ళబుచ్చిన చంద్రబాబుకి ఇప్పుడు వాస్తవాలు తెలిసొస్తున్నాయి. అయితే ఆ పరాభావన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలో తెలియక….తన ఖాతాలోనే పడుతుందేమో అన్న భయంతో సతమతమైపోతున్నాడు బాబు.
అభివృద్ది చెయ్యలేకపోవడానికి కారణం ప్రతిపక్ష వైకాపానే, జగనే అని మూడున్నరేళ్ళుగా చంద్రబాబు చెప్తూనే ఉన్నాడు కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు ప్రకటనలను అస్సలు నమ్మడం లేదు. అత్యంత అనుభవజ్ఙుడిని, ప్రపంచానికి పాఠాలు చెప్పినవాడిని కనుక నన్ను గెలిపించండి అని తన గురించి చెప్పుకున్న బాబు……….జగన్‌కి అనుభవంలేదు, చేతకానివాడు అని కూడా చెప్పాడు. అలాంటి అనుభవం లేని జగన్, అధికారం కూడా లేని జగన్, చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలను కోటాను కోట్ల రూపాయలు, ప్యాకేజీలతో కొంటూ ఉంటే అడ్డుకోలేకపోయిన జగన్…….చంద్రబాబు చేయాలనుకున్న అభివృద్ధిని ఎలా అడ్డుకోగలడు అన్నది జనం ప్రశ్న.
ఇక వైఫల్యాన్ని మోడీ ఖాతాలో వేసేద్దామా అంటే…..మోడీకి ఆగ్రహం వచ్చి ఓటుకు కోట్లు కేసులో ఇరికిస్తాడేమో అన్న భయం. అందుకే చిన్న కోర్టుల్లో కేసులు అంటూ తనను తాను సమర్థించుకోవడానికి మరో డ్రామా మొదలెట్టాడు బాబు. ఈ విషయాలను టిడిపి నేతలతో చర్చిస్తున్న సందర్భంలోనే బాబు నోటి వెంట షాకింగ్ కామెంట్ వచ్చింది. ‘128 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో కూకటివేళ్ళతో సహా లేచిపోయింది…….ఇక టిడిపి ఎంత’ అన్నట్టుగా మాట్లాడిన బాబు……2019ఎన్నికల కోసం గట్టిగా కష్టపడకపోతే కొంపమునుగుతుంది అన్న భయాన్ని వ్యక్తం చేశాడు. ఆ దెబ్బతో బాబునే నమ్ముకుని ఉన్న టిడిపి నేతలు కూడా ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి బాబు మాటలు, చర్యలన్నీ కూడా ఆయన పాలనా వైఫల్యాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాయి. ఇక మిగిలింది పోల్ మేనేజ్‌మెంట్, కుల రాజకీయాలు, వ్యూహాలు, కుట్రలు మాత్రమే. 2014లో వాటితో సక్సెస్ అయినట్టుగా 2019లో గట్టెక్కుతాడా ?