రాజకీయం గా ఎ రెండు పార్టీ లకు కూడా అస్సలు పడదు.. అందులోనే రెండు ప్రధాన పార్టీ లకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఎపిలోని ఈ పార్లమెంట్ నియోజక వర్గంలో పరిస్థితి వేరేలా ఉంది.. అక్కడ అధికార పార్టీ, ప్రధాన పతిపక్ష రెండు పార్టీ కలిసిమెలిసే ఉంటాయట.. అయితే ఐడెమ్ వైఖరి అనుకుంటున్నారా.. నిజమే నండీ తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గంలో రెండు పార్టీ లు ఎవరు హయంలో వారు ప్రతిపక్షాలకు సహకరించుకుంటూ ఉంటారట.. అయితే అది ప్రజలను బాగుచేయడానికి మాత్రం కాదు.. పంపకాల విషయంలో నట..
అవును.. అక్కడ పంపకాల విషయంలో రెండు పార్టీ ల నేతలు సహకరించుకుంటారట. మిగితా విషయంలో మాత్రం వైరం కొనసాగుతుందని అక్కడివారు చెప్పుకుంటున్నారు.. చంద్రబాబు హయాంలో వైసీపీ నేతలు అక్కడి టీడీపీ నేతలతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు రాగ ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ టీడీపీ నేతలను అక్కున చేర్చుకుని సంపాదిస్తున్నారట.. ముఖ్యంగా మైనింగ్ అక్కడ ఎక్కువ ఉండడంతో వాటి నిక్షేపాలను అక్కడి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడట.. దాన్ని అక్కడి వైసీపీ నేతలు కూడా చూసి చూడనట్టుగా ఉండడం కొసమెరుపు..
ఇక ఇంత చేస్తున్న ఇది జగన్ కి చేరనీయకుండా అక్కడి వైసీపీ నేత చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.. అక్కడి టీడీపీ మాజీ మంత్రి తో కలిసి ఎంతోచ్చినా సరే అనుకుని వారితో చేతులతో కలిసి పార్టీ ని , నమ్మిన ప్రజలను మోసం చేస్తున్నారట.. ఇక ఆ టీడీపీ మాజీ మంత్రి పరిస్థి ఎలా ఉందట తాను టీడీపీ నేత నని మర్చిపోయి చంద్రబాబు మాట వినడం మానేశారట.. బాగుంది.. అధినేతలిద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ఈ ఇద్దరు నేతలు పంపకాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు..