Thursday, May 8, 2025
- Advertisement -

తొలి తెలుగు మాజీ సీఎం చంద్రబాబు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో సీఐడీ న్యాయస్ధానం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జైలు కెళ్లిన తొలి తెలుగు మాజీ సీఎంగా నిలిచారు చంద్రబాబు. ఇక ఈ కేసులో దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్ధానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది.

చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా,సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించింది. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. చంద్రబాబుకు రిమాండ్‌ విధించారు.

బాబు తరఫున న్యాయవాదులు చేసిన వాదనలతో సీఐడీ న్యాయమూర్తి ఏకీభవించలేదు. కేసులో చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యారనేదానికి ఆధారాలున్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వాదనల తర్వాత కోర్టు పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీపీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించగా ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. మొత్తంగా అవినీతి కేసులో చంద్రబాబు జైలు కెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -