వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అవకాశాలు అనుకూలంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ మాత్రం వాటిని అనుకూలంగా మలుచుకోలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు మాదిరిగా కౌంటర్ ఇ్వవ్వలేకపోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ వైఫల్యాలను ప్రజలల్లోకి తీసుకెల్లడంలో సొంత మీడియా ఉండికూడా జగన్ విఫలమవుతున్నారని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బాబు చాపకింద నీరులా పొత్తు రాజకీయాలు మొదలు పెట్టారు. అది కూడా కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన టీడీపీని పోయి పోయి ఆయన కాంగ్రెస్ చేతుల్లోనే పెడుతుండడం టీడీపీని అభిమానించే నాయకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. నిజానికి ఇది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకం. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడమే పరమావధిగా చంద్రబాబు ఈ వికృత పొత్తుకు తెరదీశారు.
పార్లమెంటులో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమో డీ సర్కారుపై అవిశ్వాసం ప్రకటించడం వెనుక కూడా కాంగ్రెస్ మద్దతును కూడగట్టారు. ఇక, పార్లమెంటు పీఏసీ సభ్యుడిగా కడప జిల్లాకుచెందిన ఎంపీ సీఎం రమేష్ ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్‌తో ఆయన జట్టుకట్టారు. ఈ పరిణామాలను జగన్ తనకు అనుకూలంగా మలుచుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
కాపుల ఉద్యమం జరిగిన సమయంలో తుని సంఘటనను వైసీపీకి ముడి పెట్టడంలో టీడీపీ అధినేతగా బాబు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఎలాంటి సంబంధమూ లేకపోయినా ముద్రగడ పద్మనాభంతోనూ వైసీపీ అంటుకాగుతోందని చేసిన ప్రచారమూ దుమ్మురేపింది. ఇక, నిన్న మొన్నటి వరకు బీజేపీతో జగన్ అంటకాగారంటూ.. చేసిన ప్రచారం కూడా దుమ్మురేపింది. మరి ఇప్పుడు అవకాశం ఉండి కూడా జగన్ ఎందుకు టీడీపీని విమర్శించలేక పోతున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.
చేతిలో మీడియా ఉండి, పత్రిక ఉండి కూడా జగన్ .. చంద్రబాబును ఆశించిన స్తాయిలో బద్నాం చేయలేక పోతున్నారని వైసీపీ సీనియర్లే అంటున్నారు. వలం పాదయాత్ర చేయడం ద్వారా నే జగన్ అనుకున్న లక్ష్యం సాధిస్తాడనే నమ్మకం ఉన్నప్పటికీ.. దీనికి అనుకూలంగా బాబు చేస్తున్న వ్యవహారాలను సైతం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల్సి న అవసరం ఉందని అంటున్నారు. మరి జగన్ ఇప్పటికైనా ఆదిశగా అడుగులు వేస్తారా అన్నది చూడాలి.