ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో తిరుగులేని ప్రజాదరణ కలిగి ఉన్న పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆపార్టీ అధినేత చంద్రబాబు చివరికి పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదంతా చినబాబు, పెదబాబులు చేసిన స్వయంకృతమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చు కోవడం తెలుగుదేశం పతనానికి పరాకాష్టనె చెప్పాలి.
ఇప్పటికే అనేక మంది నాయకులు తెరాసలోకి చేరిపోవడం వలన.. ఎక్కడికక్కడ కేడర్ ను కూడా కోల్పోయి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు కూడా వేయలేని దుస్థితిలో తెలంగాణ తెలుగుదేశం ఉంది. రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లోచేరితే.. తెరాస వ్యతిరేకత పుష్కలంగా ఉన్న తెలుగుదేశం దిగువస్థాయి కార్యకర్తలు , కేడర్ మొత్తం.. ఆయన వెంట కాంగ్రెస్ లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. మరో వైపు మిగిలి ఉన్న నాయకులు అధికారపార్టీలోకి వెల్లినా ఆశ్చర్యంలేదు.
రేవంత్‌రెడ్డి టీడీపీని వీడితే, తెలంగాణలోపార్టీ భవిష్యత్తేంటి..? ఇదే బాబును ఆందోళనకు గురి చేస్తోంది. మిగిలిన టీడీపీ నేతలంతా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా వున్నారన్నది నిజం. మొత్తంగా చూస్తే, చెప్పుకోడానికి టీడీపీలో ఒక్క నేత కూడా మిగలని పరిస్థితి ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరకు మిగిలేది అధ్యక్షుడు ఎల్ రమణమాత్రమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో ఓ ఎంపీ సీటునీ, 15 మంది ఎమ్మెల్యేలనూ గెలిపించుకున్న టీడీపీ, అందులో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే నిలబెట్టుకుంది. ఆ ముగ్గురిలో ఒకరు ఆర్.కృష్ణయ్య. ఆయన టీడీపీలో వున్నారో లేదో ఆయనకే తెలియదు. ఇక, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలూ ఓటుకు నోటు కేసులో మొదటి, రెండవ నిందితుడు కావడం గమనార్హమిక్కడ. ఆ ఇద్దరూ పార్టీ మారితే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పరిస్థితి ఏంటి.? అసలు తెలంగాణలో టీడీపీ భవిష్యత్తేంటి.? అందుకె పార్టీ పరిస్థితి గాల్లో దీపంలా తయారయ్యింది. ఇక పార్టీని మూసుకోవాల్సిందేనా..?