సీట్ల కేటాయింపు వ్యవహారం వైసీపీకీ కొన్ని చోట్ల ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పార్టీకోసం పనిచేసిన వారిని పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తున్నారని కొందరు నేతలు మండి పడుతున్నారు. చీరాల నియోజక వర్గ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైసీపీనీ వీడి టీడీపీలో చేరిన చీరాల మాజీ వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎడం బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కాదు రిటర్న్ గిప్ట్…జగన్ ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్లు వైసీపీ కోసం కష్టపడి పనిచేశానన్నారు. కనీసీం మాటకూడా చెప్పకుండా అమంచిని పార్టీలోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. అలాంటి ఆమంచికి చీరాలలో తప్పకుండా ఓడించి తీరాలన్నారు. ఆమంచి ఆగడాలు భరించలేకనే గతంలో తాను వైసీపీలో చేరానని గుర్తు చేసుకున్నారు బాలాజీ. చీరాలలో ఆమచిని ఖశ్చితంగా ఓడిస్తామని తెలిపారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాలాజీ ఈసారి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆమంచి రాకతో బాలాజి సీటుకు ఎసరు వచ్చింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు.
- Advertisement -
జగన్‌కు రిటర్న్ గిప్ట్ ఇస్తా… టీడీపీ నేత
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -