జగన్ రావడం కాస్త ఆలస్యమైనా రావడం రావడమే కుంభస్థలం కొట్టారు..ఏపీలో దాదాపు అని నియోజక వర్గాల్లో వైసీపీ తన సత్త చాటింది.. చాటడమే కాదు మళ్ళీ ముందు ముందు ఓటమి అన్నదే ఎరుగకుండా గట్టి పునాదులు వేసుకుంది.. సరైన టైం లో సరైన లీడర్ లు జగన్ కు దొరకగం తో గతంలో దేశంలో ఏ పార్టీ ఎరుగంటువంటి ఘన విజయాన్ని జగన్ తన సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో తన ఎమ్మెల్యేలను బెదిరించి లాక్కునే చందరబాబు కు ప్రజలు చెప్పిన బుధ్ అలా ఉంచితే జగన్ మాత్రం ఆయనకు మాస్టర్ స్టాక్ ఇచ్చారని చెప్పొచ్చు.. జగన్ ప్రభంజనం ఎలా వుంది అంటే టీడీపీ కి పెట్టని కొత్తగా మిగిన ప్రాంతాలని వైసీపీ కి దాసోహం అయ్యాయి.. టీడీపీ పునాదులు కదిల్చేలా జగన్ సాధించిన ఈ విజయం కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది.. ఎంతో బలంగా ఉందన్న పార్టీ ఇలా అయిపోయేసరికి పసుపు వీరులు పసుపు తడిగుడ్డ వేసుకుని కూర్చున్నారు.. ఇక అధినేత చంద్రబాబు అయితే ఎంత దారుణంగా కుమిలిపోయాడో చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా అయన కొడుకు లోకేశుడు ఓడిపోయినందుకు బాబు దుఃఖం పొంగిపొరలిపోతుందట.. అనేక నియోజక వర్గాల్లో పార్టీ సృష్టించిన ఓటుబ్యాంకు ఒక్కసారిగా ఇంకో పార్టీ కి వెళ్లిపోవడంతో టీడీపీ దాన్ని తిరిగి ఎలా సాధించుకోవాలని తర్జనభర్జనలు పడుతుంది..
ఈ నేపథ్యంలోనే టీడీపీ లో కీలకమైన వ్యక్తి పెందుర్తి వెంకటేష్ కి ప్రజలు మంచి బుద్ధే చెప్పారని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.. తూర్పు గోదావరి జిల్లా రాజాం నియోజకవర్గం తరపున రెండుసార్లు ఆయనకు పట్టం కట్టిన ప్రజలకు అయన చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు.. ఈ పదేళ్లలో కనీసం సిమెంట్ రోడ్డు వేయించిన పాపాన పోలేదట.. దాంతో ప్రజలు తిరుగుబాటు చేసి బుద్ధి చెప్పక తప్పలేదట.. 2009 లో , 2014 లో టీడీపీ తరపున విజయకేతనం ఎగురవేసిన వెంకటేష్ 2019 లో సునాయాసంగా గెలుస్తారనుకున్నారు.. అప్పటికే టీడీపీ పై వ్యతిరేక్షత వైసీపీ పై నమ్మకం పెరగడంతో జగన్ సునామి లో ఈయన కొట్టుకుపోయాడు..
వైసీపీ తరపున పోటీ చేసిన జక్కంపూడి రాజా ఈసారి గట్టి పోటీ ఇచ్చి బంపర్ మెజారిటీ తో గెలిచారు. ఇక ఓటమితర్వాత వెంకటేష్ అసలు పార్టీ కి కాదు కదా సొంత కుటుంబ సభ్యులకే కనపడడం మానేశారట.. వాస్తవానికి వెంకటేష్‌పై చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవడమో.. లేదా చంద్రబాబు హవానే తనను గెలిపిస్తుందని అనుకున్నారో.. తెలియదు. దీంతో ఎన్నికలకు కూడా వెంకటేష్ పెద్దగా ఖర్చు పెట్టలేదని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకున్నాయి.పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం, జగన్ సర్కారుపై చంద్రబాబు చేస్తున్న అనేక పోరాటాలనుకూడా వెంకటేష్ లైట్‌గా తీసుకోవడం వంటి పరిణామాలతో నియోజకవర్గంలో అసలు టీడీపీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో ఓ షో మ్యాన్ గా మిగిలిపోయిన వెంకటేష్ రాజకీయ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి..