నంద్యాల టీడీపీ రాజకీయాల్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. టికెట్ల కేటాయంపు పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. నంద్యాల ఎంపీ టికెట్ బాబు వేరేవాళ్లకు కేటాయిస్తున్నారనే వార్తల నేపధ్యంలో ఎంపీ ఎస్పీవైరెడ్డి తన అనుచరులతో భేటీ అయ్యారు. దీనికి కారణం గౌరు ప్యామిలీ టీడీపీలో చేరడమే. పాణ్యం టికెట్ గౌరు చరితకు ఇస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. ఇదే సమయంలో నంద్యాల లోక్‌సభ స్థానం టికెట్‌పై చర్చించినట్లు తెలిసింది. గౌరు వెంకటరెడ్డి స్వయాన బావ, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో పాటు ఎస్పీవై రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనుచరులతో భేటీ అయని ఆయన పలు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మనపై పూర్తి విశ్వాసాన్ని కనబరుస్తోంది, టికెట్ మనకే వస్తుందని వెల్లడించారు. సర్వేలు చేస్తున్నారు.. అయినా, సర్వేలు సైతం మనకే అనుకూలంగా ఉన్నాయన్న ఎస్పీవై రెడ్డి.. కార్యకర్తలు అధైర్యపడొద్దంటూ ధైర్యాన్ని చెప్పారు. ఎస్పీవై రెడ్డికి ఈ సారి టికెట్ రాదని ఓ వైపు.. ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం మరోవైపు జరుగుతున్న సమయంలో.. ఎస్పీవై రెడ్డి.. కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -
అనుచరుతలతో సమావేశమయిన ఎస్పీ వైరెడ్డి..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -