Monday, April 29, 2024
- Advertisement -

తెలంగాణలో మరో కొత్తపార్టీ?

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుందా…?ఎన్నికల వేళ ఈ కొత్తపార్టీని స్ధాపించేది ఎవరు…? అంటే తీన్మార్ మల్లన్న. క్యూ న్యూస్‌ యూ ట్యూబ్ ఛానల్‌తో తన వాయిస్‌ని వినిపించే మల్లన్నకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేసి ఆయన వేసే తెలంగాణ మార్క్ డైలాగ్‌ పంచ్‌లు ఫేమస్. ఇక ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన మల్లన్న అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. అయితే అక్కడ నెలరోజులు కూడా ఉండలేకపోయిన మల్లన్న ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ఇక తాజాగా డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు మల్లన్న. తొలుత సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించినా తర్వాత మేడ్చల్ నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తన అభ్యర్ధిత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్,బీజేపీలను కోరారు. అంతేగాదు మేడ్చల్‌లో ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సొంతపార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో త్వరలోనే ప్రజల ముందుకురానున్నారట మల్లన్న. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు కూడా చేసుకున్నారని సమాచారం. ఈసీ సైతం తెలంగాణ నిర్మాణ పార్టీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరింది. ఇక మల్లన్న రాజకీయ పార్టీ పెడుతున్నారనే వార్త వైరల్‌గా మారింది. పార్టీ జెండా, ఎజెండాపై తన యూ ట్యూబ్ ఛానల్ వేదికగా ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీ నుండి ఎంతమంది పోటీ చేస్తారు…కేవలం మల్లన్న ఒకడే బరిలో ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -