- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో కాపు సమాజిక వర్గం నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత మానవతా దృక్పథంతో కేసీఆర్ స్పందిస్తే…దాన్ని కూడా రాజకీయం చేశారని బాబుపై మండి పడ్డారు. కేసీఆర్, మోదీ, కాంగ్రెస్, అమీత్‌షా లు కలసి కుట్ర చేస్తున్నారని ఆరోపించిన బాబు …ఇప్పుడు అదే కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు.
మతం, జాతి, కులం, ఆధారంగా తమ ప్రభుత్వం ఎవరిమీద వివక్ష చూపలేదనీ, అందరిని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని కేటీఆర్ తెలిపారు. బాబు చాలా తెలివైన వారని అందుకే కూకట్ పల్లి నియోజక వర్గంనుంచి పోటీకీ దింపారని మండి పడ్డారు. ఓడిపోయొ టికెట్ ఇచ్చి అమెను బలిపశువుని చేశారని మండి పడ్డారు.
నందమూరి సుహాసినిపై అంత ప్రేమే ఉంటే కొడుకు లోకేష్ మాదిరి…మంత్రి పదవి ఇవ్వచ్చుగా అని నిలదీశారు. తన కొడుకు లేకేష్‌కు ఎవరూ అడ్డు ఉండకూడదనే నెపంతోనే ఓడిపోయో కూకట్ పల్లి స్థానం నుంచి పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణా ఎన్నికల్లో బాబు జోక్యం చేసుకోవడాన్ని కూడా కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. పుట్టలో చేయి పెడితే చీమైనా కుడుతుందని…అలాంటిది తెలంగాణా ఎన్నికల్లో బాబు జోక్యం చేసుకుంటే ఊరుకుండాలాని ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఆంధ్రాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలు పెట్టడానికి వెనుకాడబోరని స్పష్టం చేశారు.
