రాజకీయ నాయకులు పార్టీలు మారడం హైదరాబాద్ ధమ్ బిర్యాని తిన్నంత ఈజీ అయ్యింది. పార్టీలు ఊరికనె మారుతారా మహానుభావులు …చాంన్‌తాడంత చిట్టా డిమాండ్లను పార్టీ అధినేతల ముందుంచుతున్నారు. పార్టీ మారడం ఏమోగాని వారి కోరికలు మరీ ఎక్కువగా ఉంటున్నాయంట. ఎమ్మెల్యే, ఎంపీలు తమకున్న ఫాలోయింగ్‌ను బట్టి చిట్టా సైజు ఉంటోందని అంటున్నారు. ఆ చిట్టాలను చూసి పార్టీ అధినేతలుకూడా బెంబెలెత్తిపోతున్నారు.
వైసీపీ ఎంపీ బుట్టారేణుఖ కోరికల చిట్టా చూస్తె దిమ్మతిరగాల్సిందె. చ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు, ప్రచార ఖర్చు కింద 100 కోట్లు(అయితే, 70 ఇచ్చేందుకు బాబు ఓకే అన్నారని సమాచారం) ఇవ్వాలని ఆమె ప్రథమ డిమాండ్‌గా పెట్టారట. నియోజకవర్గం అభివృద్ధి పనులకు 300 కోట్లు, కొన్ని కాంట్రాక్టులు ఇవ్వాలని బుట్టా తన చిట్టాను బాబుగారికి అందించారు.
ఇప్పటి వరకు బుట్టాదె పెద్ద చిట్టా అనుకుంటె అంతకుమించి కోర్కెల చిట్టాతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌తో బేరాలు మొదలెట్టారు బాబు గారి పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అయ్యారన్నది జోరుగా ప్రచారంలో ఉంది. తాను కాంగ్రెస్‌లో చేరాలంటె ప్రచార కమిటీ అధ్యక్ష పదవితో పాటు.. తన మిత్రులు, శ్రేయోభిలాషులు అయిని 25 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఆ పేర్ల జాబితాను సైతం రాహుల్ జేబులో పెట్టి వచ్చారట. దీనికి మౌనంగా ఉన్న రాహుల్.. 15 ఇచ్చేందుకు రెడీ అయ్యారని సమాచారం.
మొత్తానికి తాజా పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ తేనుండగా..తెలంగాణ టీడీపీకి చుక్కలు చూపించనున్నాయి. అధికారపార్టీని ధైర్యంగా ఎదుర్కొనె దమ్మున్ననేత రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూలేరు. సీఆర్ తో ఢీ అంటే ఢీ అని తొడగొట్టి.. పడగొట్టేందుకు ప్రయత్నించే రేవంత్ వంటి వారు ఒక్కరూ లేకపోవడం పార్టీ భవిష్యత్తు అంధకారమే.