- Advertisement -

అమెరికా పర్యటన పూర్తి..దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

8 రోజుల అమెరికా పర్యటన పూర్తి చేసుకుని దక్షిణ కొరియాకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికా పర్యటన సాగగా 30 వేలకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

తెలంగాణకు పెట్టుబడులే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అనుస‌రిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటుతోనే కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు.

సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ‌లో హ్యుందాయ్ మోటర్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందన్నారు. హ్యుందాయ్‌కి చెందిన హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంట‌ర్‌ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని తెలిపారు రేవంత్.

హెచ్ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్, ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉందని తెలిపారు రేవంత్ రెడ్డి. మెగా టెస్ట్ సెంటర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -