ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరో సారి తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా మరుగున పడిన అంశం ఇప్పుడు తెరపైకి రావడంతో ప్రాధాన్యతను సంతరించకుంది. ఒక వైపు జగన్…మరో వైపు జనసేన అధినేత పవన్ ఇద్దరూ ప్రత్యేక హోదా అంశాన్ని తమ భేజాన వేసుకన్నారు. 2019 ఎన్నికల్లోకూడా ఇదే అంశం ప్రధానం కానుంది.
జగన్ ఒకడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. దానిలో భాగంగా అనంతపురంలో యువభేరి పేరుతో సభను నిర్వహించారు. ఈ సభకు విద్యార్థులు పోటెత్తారు. యువభేరి సబలో ప్రత్యేకహోదాకోసంఅవసరం అయితె తమ పార్టీ ఎంపీల చేత రాజీనామ చేయిస్తానని ప్రకటించారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలై ఆపార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ స్పందించారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. ఎందుకు రాజీనామా చేయాలి.. రాజీనామా చేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా.. ఏమీ లేదు.. ఎవరో చెప్పారని రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు మాట్లాడుతారు.. ఆలోచించండి.. ఈ మాటలంతా చెప్పింది సాక్షాత్తు తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్.
ప్రత్యేక హోదాపై ఎంపిల చేత రాజీనామా చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి ఎంపి మాత్రం జగన్ చెబితే రాజీనామా చేయాలా.. నేను చేయను.. ఎంపిగా వుండి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామన్నారు. నిజంగా ఆపార్టీకి ఉండేది 6 లేదా 7 మంది ఎంపీలు. వీరు కూడా రాజీనామా చేస్తే పార్లమెంట్ సమావేశాల్లో దాని గురించి మాట్లాడేదెవరు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో పాత్రికేయులనే ప్రశ్నించారు వరప్రసాద్. ఆయన మాట్లాడిన దాంట్లో నిజం లేకపోలేదు.