Tuesday, May 7, 2024
- Advertisement -

2019ఎన్నికల్లో 40 సిట్టింగ్ స్థానాల్లో టిడిపి తుడిచిపెట్టుకుపోతుందిః ఆంధ్రజ్యోతి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నాట 40 మంది టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే అవకాశమే లేదు అని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తేల్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నీ బాగున్నాయి…….అంతా బాగుంది……ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు అని ప్రతి దినం కొట్టుకునే బాబు సొంత డబ్బాకు అనుక్షణం వంతపాడుతూ సాగే రాధాకృష్ణ ఇలాంటి నిజాలు చెప్తాడా? ఇప్పటికే సర్వేలన్నీ కూడా 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమనే తేల్చేస్తున్నాయి. చంద్రబాబు సొంత సర్వేలో కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్న నిజాలు బయటపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో సహా పచ్చ మీడియా జనాలందరూ కూడా అంతా బాగుంది……సూపర్……..మళ్ళీ అధికారం బాబుదే ……మళ్ళీ మేమే అధికారం అనుభవిస్తాం అనే రేంజ్‌లో వార్తా కథలు వండి వారుస్తున్నారు.

ఇలాంటి అబద్ధపు రాతలతో చంద్రబాబు భజన చేస్తూ ఉండే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు ఒక నిజాయితీతో కూడా వార్త వచ్చింది. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆంధ్రజ్యోతి తేల్చేసింది. ఆంద్రజ్యోతిలో రాధాకృష్ణకు తెలియకుండా చంద్రబాబుపై వ్యతిరేక వార్త వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈ వార్త కూడా ఆయనకు తెలిసే ఉండాలి. నలభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఓడిపోతారు…………కొన్ని స్థానాల్లో అయితే టిడిపి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అని ఆంధ్రజ్యోతిలో భారీ వార్త వచ్చింది. ఇప్పుడు ఈ వార్తనే టిడిపి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తుంటే……వైకాపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అంతా కూడా ఎమ్మెల్యేల తప్పే అని ఆంధ్రజ్యోతి కవరింగ్ ఇచ్చినప్పటికీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితి ఉందని స్వయంగా చంద్రబాబు భజన మీడియానే నిజాయితీగా చెప్పేస్తూ ఉందంటే చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అన్నింటికీ మించి ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా 40 మంది టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతే 2019 ఎన్నికల తర్వాత టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది కలలో మాట. పరోక్షంగా 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపును కూడా ఆరకంగా డిసైడ్ చేశాడు రాధాకృష్ణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ వార్తనే ట్రెండ్ అవుతూ ఉంది. 2019లో గెలుపు మాదే అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు, లోకేష్‌తో సహా టిడిపి నాయకులందరూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ వార్తపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -