ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు వసంత నాగేశ్వరరావుతో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం అతి త్వరలో వైకాపాలో చేరనున్నారు. వసంత నాగేశ్వరరావు వైకాపావైపు చూస్తున్నాడని పసిగట్టిన చంద్రబాబు……టిడిపిలో చేరాల్సిందిగా వసంతను బ్రతిమాలుకున్నాడు. అయినప్పటికీ వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ బాబు రిక్వెస్ట్‌నే బేఖాతర్ చేశారు. ఆ తర్వాత లోకేష్ టీం నుంచి వసంతకు హెచ్చరికలు వెళ్ళాయి. చాలా వ్యాపారాలు చేసుకుంటున్నారు. టిడిపిలోకి కాకుండా జగన్ వెంట వెళితే ఇబ్బందిపడతారు అన్న హెచ్చరికలు జారీ చేశారు.
అయితే వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ మాత్రం వైకాపాలో చేరడానికే వసంతను ఒప్పించాడు. వైఎస్‌తో కలిసి వర్క్ చేసిన అనుభవం వసంత సొంతం. అలాగే వైఎస్‌ల మంచితనం గురించి, మాట ఇస్తే నిలుపుకునే వైఎస్‌ల నైజం గురించి తెలిసున్న వసంత నాగేశ్వరరావు కుటుంబంతో సహా వైకాపాలో చేరడానికే మొగ్గుచూపాడు. రీసెంట్‌గా వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణప్రసాద్‌లు జగన్‌ని కలిశారు. తన కొడుక్కు టిక్కెట్ ఇస్తే చాలని…..నేను వాడికి అండగా ఉండి గెలిపించుకుంటానని వసంత నాగేశ్వరరావు అడగడంతో వసంత కృష్ణప్రసాద్‌కి మైలవరం టికెట్ ఆఫర్ చేశాడు జగన్. మైలవరం సీటు నుంచి 2019లో కచ్చితంగా వైకాపా గెలిచేలా చేస్తానని జగన్‌కి మాట ఇచ్చాడు వసంత నాగేశ్వరరావు. అతి త్వరలోనే వసంత కుటుంబం మొత్తం అధికారికంగా జగన్ సమక్షంలో వైకాపాలో చేరనుంది.