Monday, May 12, 2025
- Advertisement -

టీడీపీలో చేరిన వైసీపీ కీల‌క నేత

- Advertisement -

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పడుతున్న తున్న కొద్దీ ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీల‌యిన వైసీపీ, టీడీపీల‌లో వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది టీడీపీ నుంచి వైసీపీలో చేర‌గా ఇప్పుడు తాజాగా ఉత్త‌రాంధ్ర వైసీపీ సీనియ‌ర్ నేత టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో విజయనగరంలో జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి గుడ్ బై చెప్పి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్వతీపురంలో ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా శత్రుచర్లకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్.

వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీలో శత్రుచర్ల కీలక నేతగా ఉన్నారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి శత్రుచర్ల స్వయానా మామ. వైయస్ కు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. మరో విషయం ఏమిటంటే… వైసీపీని జగన్ స్థాపించిన తర్వాత… విజయనగరం జిల్లాలో ఆయనకు మద్దతు ప్రకటించిన తొలి నేత ఈయనే కావడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -