40 సంవత్సారాల అనుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఎన్నో రాజకీసంక్షభాలు ఎదుర్కొన్న బాబకు సొంత పార్టీలో ఉన్న సంక్షోభం మాత్రం చెమటులు పట్టిస్తోంది. లోకేష్ చేసిన అవినీతిపై తమ వద్ద ఆధారాలు న్నాయని వాటిని అవసరం అయినపుడు బయటపెడతామని జనసేన బాంబు పేల్చింది.
అంతటితో ఊరుకోకుండా 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం చంద్రబాబుకు తెలుసునని మరో అణుబాంబ్ పేల్చారు. పవన్ యాథాలాపంగా మాట్లాడారా? లేదంటే నిజంగానే ఆయనతో వారు టచ్లో ఉన్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
మంత్రి లోకేశ్ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. త్వరలో ఏపీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల బండారం బయటపెట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎప్పుడు చూసినా ఎన్నో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నానని 40 సంవత్సరాల రాజకీయం అనుభం ఉందన్న బాబు మరి ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడలి.