టీడీపీ అధినేత చంద్రబాబు టైం అస్సలు బాగాలేదు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు జరిగిన అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. 2015లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇందుకోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.3,356 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం. దీంతో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణ.
కేబినెట్‌ను తప్పుదారి పట్టింది ఆ తర్వాత ఒప్పందాన్ని మార్చి షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్ల కుంభకోణం జరిగిందనేది ఆరోపణ.ఈ ప్రాజెక్టు కోసం తయారు చేసిన అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆఘమేఘాల మీద కేబినెట్ అప్రూవల్ జీవో కూడా ఇచ్చేశారు. ఈ వ్యవహారం అంతా జరిగింది నిబంధనలకు విరుద్దంగా. ప్రధానంగా జీవో ఒకటి ఉంటే ఒప్పందం మరోలా ఉంటుంది. దీంతో జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు ఎలా చేశారన్నదే ప్రధాన ప్రశ్న.
అలాగే సీమెన్స్ నుండి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఒక్క పైసా కూడా రాకుండానే పలు దఫాలుగా టీడీపీ సర్కార్ రూ. 371 కోట్లు విడుదల చేసింది. ఈ డబ్బు విదేశాలకు అక్కడినుండి షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి తిరిగి టీడీపీకి చేరాయి. ఇక ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించించాయి పీవీఎస్‌పీ/స్కిల్లర్,డిజైన్ టెక్ సంస్థలు. ఈ రెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండానే సెన్‌వాట్ కోసం క్లెయిమ్ చేశాయి. దీంతో వ్యవహారం మొత్తం బయటకువచ్చింది.
దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ విచారణ చేపట్టింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ కూడా జరిగింది. తొలుత విజిలెన్స్, తర్వాత ఏసీపీ విచారణ చేపట్టగా 2021 డిసెంబర్‌లో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తాజాగా సీఐడీ అధికారులు ఈ కేసులో చంద్రబాబును ఏ1గా, అచ్చెన్నాయుడిని ఏ2గా చేర్చారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ..1988 ప్రివెన్షన్ ఆఫ కరెప్షన్ చట్టం కింద అరెస్ట్ చేశారు.