Thursday, May 8, 2025
- Advertisement -

అచ్చెన్నాయుడు ని ఓడించడం అంత సులభం కాదు….?

- Advertisement -

టీడీపీ కి బలమైన స్థానాల్లో ఒకటి టెక్కలి. ఇక్కడ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా గెలుస్తూ వచ్చారు.. 2014 లో ఇక్కడ టీడీపీ తరపున గెలిచి మంత్రి గా పనిచేశారు. జగన్ సునామి లో కూడా వైసీపీ పై అయన సునాయాసంగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.. అయితే విధి వక్రీకరించి ఆయన స్కాములో అడ్డంగా దొరికిపోవడంతో జైలులో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.. శ్రీకాకుళంలో కీలకనియోజక వర్గమైన ఈ టెక్కలి లో అధికారంలో కోసం వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతోందని, నేతలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా జనాలు టీడీపీ వైపుకే మొగ్గుచూస్తుండడం జగన్ కు ఆశ్చర్యం కలిగిస్తుంది..

ఇక్కడ జగన్ వేసిన ఎత్తులు ఏవీ పనిచేయలేదని అక్కడి నేతల వాదన.. 2004 నుంచి ఇక్కడ దువ్వాడ శ్రీను ఫ్యామిలీ పోటీ చేస్తూ వ‌స్తోంది. 2004లో ఇక్కడ దువ్వాడ వాణి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీను ఓడిపోగా.. ఆ త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఓడారు.2014 లో  వైఎస్సార్ సీపీ టికెట్‌ను దువ్వాడ శ్రీనుకు కానీ కింజరాపు ఊపులో దువ్వాడ ఓడిపోయారు. దాంతో 2019 లో  పేరాడ తిల‌క్‌ను తీసుకువ‌చ్చి.. ఇక్కడ నిల‌బెట్టి.. దువ్వాడ‌కు శ్రీకాకుళం ఎంపీ సీటును కేటాయించారు.అయినా ఇద్దరు దారుణంగా ఓడిపోయారు..

దాంతో ఈ ఓటమికి పేరాడ తిల‌క్‌ ను నిందిస్తూ పార్టీ ని మళ్ళీ దువ్వాడ కె అప్పగించింది. ఇంత బలంగా ఉన్నప్పుడే టెక్కలి ఎంపీ,ఎమ్మెల్యే సీటు తో పాటు కోల్పోవడంతో ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టెక్కలిలో పేరాడ తిల‌క్ వైపే మొగ్గు చూపిన జ‌గ‌న్ ఇప్పుడు దువ్వాడ శ్రీనుపై మంచి సానుకూల ధృక్పథంతో ఉన్నారు. ఈ మార్పుతో ఇప్పుడు పేరాడ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.అయితే ఇక్కడ ఎంత ట్రై చేసినా పార్టీ పైకి రాకపోవడానికి కారణం గ్రూప్ రాజకీయాలే అని అంటున్నారు.. కిల్లి ఒక‌వైపు, పేరాడ‌, దువ్వాడ‌లు ఎవ‌రికి వారు గ్రూపు రాజ‌కీయాలు చేస్తుండడంతో వైసీపీ బ‌లోపేతం కాలేకపోయింది అంటున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -