మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లిన ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ పై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వైసీపీలోకి ముద్రగడ వెళ్తారని.. అందుకు ఆయన ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారని టీడీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. తుని ఘటన తర్వాత ఆయన పూర్తిగా వైసీపీ కంట్రోల్‌లోకి వెళ్లారని చర్చలు కూడా నడిచాయి. ఇక రీసెంట్ గా ఆయన తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్రకు రెడీ కావడంతో.. కాపు ఉద్యమం మళ్లీ హీటెక్కుతుందా ? అన్న సందేహం వస్తోంది.
అయితే ముందుగానే ప్రభుత్వం ఆయన్ను హౌస్ అరెస్టు చేయడంతో ఆయన పాదమాత్రకు బ్రేక్ పడింది. కాపు ఉద్యమం ఎఫెక్ట్‌తో ముద్రగడ బాగా ట్రెండ్ అయ్యారు. ముద్రగడ ఎఫెక్ట్ తర్వాత కాపులను బీసీల్లో చేర్చే అంశంపై టీడీపీ మరింత నాన్చుతోంది. అయితే బీసీల్లో కాపులను చేరిస్తే.. ఆ క్రెడిట్ ముద్రగడకు దక్కుతుందన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు ప్లాన్ ప్రకారం కాపు కార్పొరేషన్ ఏర్పరిచి కాపులకు రుణాలు ఇవ్వడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు సోషల్ మీడియాలో జోరునా ప్రచారం జరుగుతోంది.
వచ్చే నెల 23వ వైసీపీలోకి ముద్రగడ చేరబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. వైసీపీలో చెరితే.. జగన్.. ముద్రగడకు కాకినాడ నుంచి లోక్‌సభ టిక్కెట్టు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన గతంలో అక్కడ నుండి ఎంపీగా గెలిచారు. ఈ నెపథ్యంలోనే కాపుల్లో ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్న ముద్రగడను తన పార్టీలో చేర్చుకుని సరైన ప్రయారిటీ ఇస్తే కాపుల్లో వైసీపీకి బలమైన నాయకుడు దొరికినట్లు అవుతుందని.. జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.