ఏపీలో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందకుంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ముందస్తుకే జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారట సీఎం జగన్. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్‌కు ముందు టీడీపీ, జనసేన నేతలు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం చేశారు. టీడీపీ నేతలు సిద్దంగా ఉండాలని బాబు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే వాటిని వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు.
తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెళ్తామని చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. తాజాగా ఇప్పుడు టీడీపీ నేతలు మందస్తు అంటే బయపడుతుండగా వైసీపీ నేతలు మాత్రం జై కొడుతున్నారు. తాజాగా సీఎం జగన్ సైతం నేతలకు ముందస్తుపై సమాచారం ఇచ్చారని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి జగన్ సర్కార్‌పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. దీనిని అధిగమించడం ఎలా అని కసరత్తు చేస్తున్న జగన్‌కు చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ కావడం లడ్డూలా కలిసివచ్చింది. అంతే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతున్నారు జగన్. చంద్రబాబును జైలుకు పంపడంతో తనపై ఉన్న వ్యతిరేకత ను కొంతమేర డైవర్ట్ చేసుకోగలిగిన జగన్..ఇదే ఊపులో ఎన్నికలకు వెళ్లడం ద్వారా టీడీపీని పాతాళంలోకి తొక్కేయొచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుత పరిణామాలు చూస్తే చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే ఆ పార్టీ నేతలు సైతం ముందస్తుపై బహిరంగంగానే కుండబద్దలు కొడుతుండటంతో త్వరలోనే ఎన్నిలకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు వస్తే టీడీపీ పరిస్థితి ఏంటా అన్నది ప్రశ్నార్థకమేనని పొలిటికల్ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు.