Sunday, May 11, 2025
- Advertisement -

దేశంలో బెస్ట్ సీఎం గా 3 వర్యాంకులో జగన్..5 వస్థానంలో కేసీఆర్

- Advertisement -

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…ఇప్పుడో ఆయన యువ సంచలనం. అనుభవానికీ, కొత్త తరానికి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జనం కొత్త తరానికే అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి పరిపాలన ఏంటో చూపిస్తా అని జగన్ పిలుపుకు ఆంధ్రా జనం పట్టం కట్టారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ.. తన రాజకీయ చరిత్రలోనే అతి తక్కువ స్థానాలకు పరిమితమైంది. చివరకు ఎవరూ ఊహించనంత 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే దేశంలో బెస్ట్ సీఎం అనిపించుకున్నారు . జగన్ కంటే ఎంతో సీనియర్ అయిన పొరుగు రాష్ట్రం మఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ ను బీట్ చేయలేకపోయారు. అసలు దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత పాపులర్ ఎవరు అనే అంశం తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ ‘దేశ్ కా మూడ్’ పేరిట ఓ సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలవగా.. కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. లిస్ట్ లో 81 పాయింట్స్ తో నవీన్ పట్నాయక్ మరోసారి మొదటి స్థానంలో నిలవగా.. 72 పాయింట్లతో యోగీ ఆదిత్యనాధ్ రెండో స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరి తర్వాత మూడో స్థానంలో 71 పాయింట్లతో నిలిచారు ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటినుంచే జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, చేపడుతున్న సంస్కరణలు ఆయనకు ఈ స్థానాన్ని కట్టబెట్టాయి. ఆగస్ట్ 9 నుంచి 14వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో 11వేల 252 మంది పాల్గొన్నారు.

జగన్ పాలనపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించలేదనే విషయం కూడా ఈ సర్వేతో మరోసారి రుజువైంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వల్లనే జగన్ ఇలా ఉత్తమ ముఖ్యమంత్రిగా దూసుకుపోతున్నారు.నవరత్నాల అమలు కోసం ప్రతి రోజూ కష్టపడుతున్న కష్టానికి రాష్ట్రప్రజలు తమ పూర్తి మద్దతు సర్వేలో తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -