ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందుకె ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. కోర్టు అనుమతి ఇవ్వకపోయినా తను చేపట్టనున్న పాదయాత్రను వాయిదా వేయకుండా ముందుకు కొనసాగించనున్నారు. చివరికి అసెంబ్లీ సమావేశాలను బహిస్కరించి పాదయాత్రకు సిద్ధమవతున్నారు. వచ్చె నెల 6 వతేదీనుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
పాదయాత్రను విజయవంతం చేసేందుకు జగన్ పక్కాప్రణాలికను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్ష పదవులను తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు ఒక అధ్యక్షడిగా 13 మంది ఉండేవారు. అయితె తాజాగా జిల్లా అధ్యక్ష పదవులను తొలగించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడిని నియమించారు. పార్టీ బాధ్యతలను ఒక జిల్లాలో ఇద్దరు నేతలు సమన్వయంతో నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక ఇంఛార్జ్ ని కూడా నియమించాడు.
తమ పార్టీని ప్రజల్లోకి మరింతగా చేరువ చేసేందుకు జగన్ ఈనిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ నేతలు హర్షం వ్యకతం చేస్తున్నారు. నేతలు, శ్రేణుల మధ్య సమన్వయం కోసం జగన్.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడిని నియమించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే.. ఈ నియోజకవర్గ అధ్యక్షులను కేవలం పాదయాత్ర వరకు మాత్రమేనా లేదా ఎన్నికల వరకూ కొనసాగిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏదైమైనా జగన్ తీసుకున్న ఈ సరికొత్త సంచలన నిర్ణయం జగన్‌ను గట్టెక్కిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.