Saturday, April 27, 2024
- Advertisement -

దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్

- Advertisement -

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నివేదిక ప్రకారం వైఎస్ జగన్‌ ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఉంది. అంతేకాదు.. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం.. అంటే 29 మంది కోటీశ్వరులు ఉన్నారు.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టాప్‌లో ఉండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఖర్లో ఉన్నారు. మమతా బెనర్జీ ఆస్తులు కేవలం రూ.15 లక్షలే అని నివేదికలో వెల్లడించింది. మొదటి స్థానంలో రూ.510 కోట్లతో జగన్.. రెండో స్థానంలో రూ.163 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ.. మూడో స్థానంలో రూ.63 కోట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు రూ.23 కోట్లు అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆస్తి కోటి రూపాయలు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆస్తి కోటి రూపాయల పైనే ఉందని.. ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదికలు వెల్లడించాయి. బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆస్తి రూ.3 కోట్లు , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.3 కోట్లకు పైగా ఉంది. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్తులు కోటి రూపాయలకు పైగా ఉంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తి రూ.15 లక్షలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -