ఏపీలో జరిగే 2019 సార్వత్రిక ఎన్నికలు వైసీపీ, టీడీపీల మధ్యనే వార్ అన్నది అందరికీ తెలిసిందే. దేశ రాజకీయ పార్టీల చూపు ఏపీపైనే ఉండనుంది. టీడీపీకీ ఏమో గాని వైసీపీకీ మాత్రం చావారేవే లాంటివి. అందుకే వైఎస్ జగన్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే సంవత్సరానికి పైగా పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉన్నారు. మరో వైపు చంద్రబాబు కూడా మరో సారి అధికారంలోకి రావడానికి నానా తంటాలు పడుతున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి, భూ, ఇసుక కుంభకోణాలు, ప్రభుత్వ అధికారులపై దాడులు, ప్రాజెక్టుల్లో దోపిడీ లాంటి వాటిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగినా, 2019 లో జరిగినా వైసీపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అనేక జాతీయ సర్వేల్లో వెల్లడయ్యింది. పాదయాత్రలో జగన్‌కు మద్దతుగా ప్రజాస్పందన ఊహించని రీతిలో వస్తోంది.
విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సి ప్రత్యేక హోదా విషయంలో బాబు ఎన్ని సార్లు యూటర్న్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలిసిందే. జగన్‌పై కత్తి దాడి ఘటన విషయంలో బాబు వ్వవహరించిన తీరుపై ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉంది. అదే సమయంలో జగన్‌కు ప్రజల సానుభూతి మరింత పెరిగింది.
తెలంగాణాలో టీడీపీ బ్రతికి బట్ట కట్టాలంటే వేరే గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీతో జత కట్టి మహాకూటమిని ఏర్పటు చేశాయి. ఇక ఏపీలో కూడా హస్తంతో బాబు పొత్తు పెట్టుకోనున్నారు. బాబు ఎలాంటి వ్యూహాలు పన్నినా ఈ సారి మాత్రం అధికారం వైసీపీదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజాగా ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జగన్ పై మారో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్లమెంటు స్థానాలను వైసీపీ క్లీన్ స్విప్ చేస్తుందని జోష్యం చెప్పారు. 24 ఎంపీ సీట్లకు గాను 24 సీటులు జగన్ పార్టీ గెలుచుకుంటందని తెలిపారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌కు సిగిల్ సీటు కూడా రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2014 లో తక్కు వ ఓటు శాతంతో అధికారం కోల్పోయిన జగన్ ఈసారి ఖశ్చితంగా అధికారంలోకి వస్తారన్నారు. గత తప్పులను మరో సారి పునరావృతం కాకుండా జగణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఈ సారి వైసీపీలో గట్టి క్యాండేట్లు ఉన్నారని తెలిపారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా జగనే సీఎం పీఠంపై కూర్చుంటారని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
https://www.facebook.com/100006551148416/videos/2324478454447170/