రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చె ఎన్నికల నాటికి కొత్త పొత్తులు చోటుచేసుకోనున్నాయి. గుంటూరులో పవన్ నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న జనసేన, టీడీపీలు బద్దశత్రువులుగా మారిపోయారు. నిన్నటివరకు బాబు,టీడీపీ ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చిన పవన్ ఒక్కసారిగా రూటు మార్చారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ బాబుప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, అదికారులపై దాడులు లాంటి వాటిపై బాణాలు ఎక్కుపెట్టారు.
పవన్ వ్యాఖ్యలు చూస్తే స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా జగన్‌చేస్తున్న పోరాటం, పవన్ వ్యాఖ్యలు ఒకే విధంగా ఉండటం గమనర్హం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన పార్టీలు ఇద్దరూ కలిసి పోటీచేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడిన మాటలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో వరప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య పవన్ కల్యాణ్ తో తాను ఫోనులో మాట్లాడానని వ్యాఖ్యానించారు. తనపై వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని పవన్ అడిగారని, ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే విమర్శస్తున్నానని చెప్పానని అన్నారు.
తాను టీడీపీతోలేనని అవసరమైతే జగన్‌కే మద్దతిస్తానని పవన్ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు. రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతామని, 100 ఎంపీలు మద్దతిచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానంపై పవన్ కూడా ఇటీవల మాట్లాడారని, ఇతర పార్టీల మద్దతు కూడగడతానని చెప్పారని, పవన్ ఆ పని చేయాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 2019 ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనడంలో సందేహంలేదనిపిస్తోంది.