వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. బాబును జైలుకు పంపించేంత వరకు నిద్రపోన్నారు. సీఎంను బోనులోకి ఎక్కించే వరకు ప్రధాని మోదీనీ కలుస్తూనే ఉంటాయన్నారు. కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ. లక్షా 25వేల కోట్లు ఏమాయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు విజయసాయి.
చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించారని… రాజ్యసభలో తాను వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రధానిని ఇష్టం వచ్చినన్ని సార్లు కలుస్తానని… దీనిపై టీడీపీకి అభ్యంతరమేంటని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని… దీనికి చంద్రబాబే కారణమన్నారు. ఆయనపై చర్యలు తీసుకొనే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రధాని, కేంద్రమంత్రుల్ని విజసాయిరెడ్డి కలవడంపై టీడీపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసింది. దీనిపై ఎప్పటికప్పుడు ఆయన కూడా కౌంటర్లు ఇస్తున్నారు.