2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పాదయాత్ర చేస్తున్న జగన్ బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు కొన్ని చోట్ల విఫలమవుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ త్వరలో ప్రకాశం జిల్లాలో నుండి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశిస్తారు. ఆ సమయానికి చెప్పుకోదగ్గ సంఖ్యలో కమ్మ సామాజికవర్గం నేతలను వైసిపిలోకి చేర్చుకోవాలన్న లక్ష్యంతో శేషగిరిరావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని రేపల్లె కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ దేవినేని మల్లికార్జున్ ను సంప్రదించినా ఉపయోగం కనబడలేదు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులెవరూ వైసిపిలో చేరటానికి పెద్దగా ఆసక్త చూపటం లేద’న్నారు. అదే సామాజికవర్గానికి చెందిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లో లేకపోతే జగన్ పై నమ్మకం లేకో తెలీటం లేదన్నారు. కమ్మ సామాజికవర్గానికి బాగా ప్రాబల్యం కలిగిన గుంటూరు, కృఫ్ణ జిల్లాల్లోనే చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేస్తుండటం కూడా చంద్రబాబును వదిలి రావటానికి కమ్మోరులో అత్యధికులు ఇష్టపడటం లేదని కూడా అన్నారు.
ప్రస్తుతం వైసిపిలో కొందరు కమ్మ నేతలున్నప్పటికీ ఆ సంఖ్య చాలదని అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్దితుల్లో మార్పు వస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.