నేడు విడుదల కావాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాను 16వ తేదీకి వాయిదా పడింది. జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్దంగా ఉన్నా చివరినిమిషంలో అనూహ్య ట్విస్ట్ చేసుకుంది. తొలిజాబితా వాయిదాకు కారణం తెలుపుతూ పార్టీలో చేరికలు అధికంగా ఉన్నందున, వారిని ఆహ్వానిస్తూ, వైఎస్ జగన్ బిజీగా ఉండటంతో మంచి సమయం దాటిందని పేర్కొంది. అయితే అనూహ్యంగా వైసీపీ అభ్యర్ధుల జాబితా విడుదల వాయిదా పడడంతో రాజకీయవర్గాల్లో హాట్ అవుతోంది. అయితే దీని వెనుక రెండు కారణాలు బలంగా కనిపిస్తున్నాయి.
16న ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే రోజున వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ తరుపున పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్తుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. తొలి విడత అభ్యర్థుల జాబితాను బుధవారం ఉదయం 10.20 గంటలకు ప్రకటించనున్నారని ముందుగా ప్రకటించారు. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడతలో 100 ఎమ్మెల్యే, 15 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు పార్టీ ప్రకటించింది. ఇవాళ ముహూర్తం దాటిపోయినందునే జాబితా విడుదలను వాయిదా వేశామని, ఇప్పటికే సిద్ధమైన జాబితాను మార్చేది లేదని వెల్లడించింది.
ఇదలా ఉంటే జాబితా వాయిదా వెనుక పీకే ప్లాన్ కూడా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది నెలలుగా వైసీపీలో పీకేకు చెందిన పలు టీమ్‌లు రాష్ట్రమంతటా సర్వేలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సర్వే అధారంగానే జగన్ అభ్యర్తులను ఫైనల్ చేశారు. జాబితా విడుదల అవుతుండటంతో ముందుగానే జగన్‌తో పీకే సమావేశం అయినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే సిద్దం చేసిన జాబితాలో స్వల్లమార్పులు చేసె అవకాశాలు ఉన్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. వాటిని కూడా ఫైనలైజ్ చేసి వైసీపీ జాబితాను 16 న ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు జగన్. అక్కడనుంచే జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.