తమకు బలం లేకున్నా కొన్ని రాజకీయ పార్టీలు బాహుబలిని అనే ప్రచారం చేసుకోవడం సహజం. కనీసం పార్టీ తరుపున అభ్యర్తులు లేకున్నా ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటుంటారు. రాష్ట్రంలో పార్టీకి బలం ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీ బలంగా లేకపోయినా బలంగా ఉందని చెప్పుకోకపోతె పరువుపోతుందనె భావన ఉండటం సహజం. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలానె ఉంది.
ఏపీలో వైసీపీ బలమైన ప్రతిపక్ష పార్టీ. కాని తెలంగాణాలో చూసుకుంటె పార్టీ పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ అసలు పార్టీ కి ఉనికే లేదనె విషయం తెలిసిందే. చెప్పుకోవడానికి అరకొర నాయకులు ఉన్నా ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాటం చేసిందిలేదు. జగన్ తెలంగాణాలో పార్టీని ఏనాడో వదిలేశారనె చెప్పవచ్చు.
ఏపీలో మాత్రం అధికారంలోకి రావడానికి తన ఫోకస్ అంతా పెట్టారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్కడే వ్యూహాలు రచిస్తున్నారు. సభ్యత్వ నమోదు అక్కడే జరుగుతోంది. ‘వైఎస్సార్ కుటుంబంవంటి కార్యక్రమాలూ అక్కడే జరుగుతున్నాయి. వచ్చే నెలలో జగన్ పాదయాత్ర కూడా ఏపీకే పరిమితమైంది.
ఇక తెలంగాణలో పార్టీ ఉందని చెప్పుకోవచ్చా? కాని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 80 స్థానాల్లో పోటీ చేస్తుందని ఓ ఆంగ్ల పత్రికకు చెప్పారు. చెప్పడం బాగానె ఉంది. ఎనభై స్థానాల్లో అభ్యర్థులను నిలబెడితే ఒక్కరైనా గెలుస్తారా? అసలు ముందుగా అభ్యర్థులు దొరుకుతారా అనేది సందేహమే. పోటీలో నిలిచిన అభ్యర్తులు ఖర్చుపెట్టగలరా ..? బలంగా ఉన్న టీడీపీయే ఉనికికోసం పోరాటం చేస్తుంటె నిన్నకాక మొన్న వచ్చిన వైసీపీకి అంత సీనుందా..?
చివరకు పొత్తుల కోసం ప్రయత్నాలు చేయాల్సిందే తప్ప ఒంటరిగా పోటీ చేయడంవల్ల ప్రయోజనం ఉండదు. వైఎస్సార్ పేరు చెప్పుకొని, ఆయన పాలనలో ప్రజలకు జరిగిన ప్రయోజనాలు గుర్తు చేసి ప్రచారం సాగించాల్సిందే. ఎన్టీఆర్‌నే జనం మర్చిపోయారు. అయితె తెలంగాణలో జగన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.