Thursday, May 8, 2025
- Advertisement -

జీలకర్రతో ఇన్ని లాభాలా…? చూస్తే ఆశ్చర్యపోతారు…!

- Advertisement -

వంటింట్లో పోపుల డబ్బాలో కనిపించే జీలకర్ర.. రుచికరమైన ఆహారం కోసం వాడుతుంటాం. అయితే ఇది రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి అని ఇప్పటికే పలువురు ఆరోగ్య నిపుణులు నిజం చేసి చూపించారు. అయితే.. జీరాను నైట్ అంతా నానబెట్టి అలా వచ్చే నీటిని తాగితే చాలా సమస్యల నుంచి నివారణ కలుగుతుంది.అసలు జీరా నీటిని తాగితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో ఓసారి చూద్దాం.

జస్ట్ ఒక్క గ్లాస్ నీటిలో రెండే రెండు చెంచాల జీరాను వేసి నైట్ నానబెట్టాలి.మార్నింగ్ ఆ జీరాతో నీటిని మళ్లీ వేడిచేయాలి. చల్లారిన తర్వాత జీరాను సెపరేట్ చేసి, ఆ నీటిని కొద్ది కొద్దిగా పావుగంట వ్యవధలో తాగాలి. ఇలా సేవించడం వలన దానిలోని ఐరన్‌, కాపర్‌, పొటాషియమ్‌, మెగ్నీషియమ్‌ చాలా సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ నీటిని సేవిస్తే ఎసిడిటి ప్రాబ్లమ్స్‌ పూర్తిగా తొలగిపోతాయి. శరీరం డిటాక్స్‌ కూడా అవుతుంది. జీరా నీటిని తాగితే రక్త ప్రసరణ మంచిగా ఉంటుంది.

బాడీ పెయిన్స్‌ లాంటి సమస్యలను ఇది నివారిస్తుంది. రోజు దీనిని సేవించడం వల్ల జీర్ణ సమస్యలు అస్సలు దరిచేరవు. జీరాలో ఉండే ఐరన్‌… రక్తంలోని హీమోగ్లోబిన్‌ లెవల్‌ను పెంచుతుంది. దాంతో ఎన్నో శృంగార సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్లమవుతాం. హెడేక్ తరహా సమస్యల నుంచి ఎంతో ఉపశమనమిస్తుంది. కడుపునొప్పి వస్తే… గడం వల్ల కడుపులో చల్లగా అనిపించి నొప్పి తగ్గుతుంది. ఓ పద్దతి ప్రకారం జీరా నీటిని తాగడం వలన… బరువు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌ లోకి వస్తుంది. హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ తగ్గే అవకాశాలూ ఉన్నాయి.అయితే.. గర్భిణులు, పీరియడ్స్‌ సమయంలో కానీ, బిపి, డయాబెటిస్‌ పేషెంట్స్‌ జీరాను ఉపయోగించరాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -