Wednesday, May 22, 2024
- Advertisement -

బాబు ఫ్రస్ట్రేషన్@పీక్స్…….. తోక పత్రిక అధినేతకు చీవాట్లు

- Advertisement -

నాలుగేళ్ళుగా తన అధికారాన్ని ఎంజాయ్ చేశాడు చంద్రబాబు. రాజధాని ఎక్కడ స్థాపించాలి అనే విషయం నుంచీ పోలవరం నిర్మాణం, ప్యాకేజీకి ఒప్పుకోవడం…….ఇలా అన్ని విషయాల్లోనూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసినప్పుడు వచ్చిన విమర్శలకు కూడా ఘాటుగా స్పందించాడు. ‘నాకు చెప్పేస్థాయి ఎవరికీ లేదు…….నా నిర్ణయం ఫైనల్……నేనే కింగ్’ అనే స్థాయిలో చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు తీరుతో విసిగిపోయిన ఐఎఎస్‌లు కూడా ఢిల్లీకి వెళ్ళిపోయారు. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు తీరుపై అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ స్థాయిలో నియంతలా వ్యవహరించాడు చంద్రబాబు.

అయితే ఎన్నికల ఏడాది వచ్చేసరికి పరిస్థితులు అన్నీ తల్లకిందులైపోతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎవరికైతే అనుభవం లేదు అని విమర్శలు చేస్తూ వచ్చాడో ఈ రోజు అదే జగన్‌ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్న మాటలనే ఈ రోజు తాను చెప్పాల్సిన అగత్యం. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి గురించి నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్న మాటలను పూర్తిగా నిరూపించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తన భజన మీడియా పూర్తిగా ఫెయిల్ అయిందని చంద్రబాబు ఆగ్రహం చెందుతున్నాడు. చంద్రబాబు పూర్తిగా అవినీతికి పాల్పడి, అక్రమాలు చేసినప్పుడు కూడా బాబు గొప్పోడు అని ప్రజలను నమ్మించిన తోక పత్రిక అధినేత…….చంద్రబాబు చేతకానితనాన్ని కూడా హీరోయిజం అని చెప్పి ప్రజలను నమ్మించిన ఓపెన్ హార్ట్ సర్జన్ ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడన్నది బాబు భావన. అందుకే ఇప్పుడు ఆ మీడియా అధినేతను పర్సనల్‌గా కలిసి ఆగ్రహం వ్యక్తం చేశాడట చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన చేతకానితనం తెలిసిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు? నన్ను బఫూన్‌ని చేద్దామనుకుంటున్నారా? ప్రయోజనాలు పొందడంలో ఉన్న ఆసక్తి నా అధికారాన్ని నిలబెట్టడంలో లేకపోతే ఎలా అని చివాట్లు వేశాడు చంద్రబాబు. అయితే భజన చేయడంలో చాలా గొప్పోడు అయిన ఆ అధినేత కూడా వెంటనే తన మాటలతో బాబును కూల్ చేశాడు. కరెక్ట్‌గా వారం రోజుల్లో పరిస్థితులు టర్న్ అయ్యేలా చేస్తానని చెప్పాడట. జగన్ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీస్తానని మాట ఇచ్చాడట. అలాగే పవన్ కళ్యాన్ కమెడియన్‌గా ప్రజలను నమ్మిస్తానని చెప్పాడట. మరి ముందు ముందు ఆ తోక పత్రికలో ఇంకా ఏ స్థాయి విషం జగన్‌పై కురిపిస్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -