Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి తో పోల్చద్దు బాబోయ్ ::

- Advertisement -

బాహుబలి సినిమా ఇప్పుడు లేని పోనీ తలనొప్పులు తెచ్చి పెడుతోంది, ఆ సినిమా నుంచి ఆదర్శంగా తీసుకుని దాన్ని తలదన్నే సినిమా తీయాలని చేతులు కాల్చుకున్న వారి నుంచి ఆ సినిమా తో ఏ మాత్రం సంబంధం లేని సినిమా తీసిన వారి వరకూ పరిశ్రమ లో బాహుబలి బాధితులు అవుతున్నారు ఎందుకంటే , గ్రాఫిక్ లు ఉపయోగించిన ప్రతీ సారీ దాన్ని బాహుబలి తో పోల్చడం పరిపాటి గా మారింది. 

బాహుబలి లాంటి బడ్జెట్ , బాహుబలి లాంటి సాంకేతిక నిపుణులూ లేకుండా బాహుబలి లాంటి వీ ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ లు రాబట్టడం అంటే మాటలు కానే కాదు. అన్నటికంటే ముఖ్యంగా ఎంత బడ్జెట్ ఉన్నా కానీ జక్కన్న లాంటి తెలివిగల డైరెక్టర్ వీరి అందరినీ కాప్టెన్ ఆఫ్ షిప్ గా నడిపిస్తూ ఎన్నో నెలలు కష్టపడితే అలంటి ఖలాఖండాలు బయటపడాలి.

అందుకే బాహుబలి సినిమా ప్రస్తావన ఎప్పుడు పడితే అప్పుడు తీసుకువచ్చి ప్రజల ముందు ఇరుక్కోకూడదు.

 అఖిల్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే ఆ విషయం సూటిగా చెప్పకుండా నాగార్జున చేసిన పని ఇప్పుడు అయన కి కొత్త తలనొప్పి తెచ్చింది. అఖిల్ సినిమా గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమవుతోందని చెప్పడానికి బాహుబలిని బయటికి  లాగాడు. ఆ సినిమా కూడా యేడాదిన్నరపాటు వాయిదా పడిందంటే కారణం గ్రాఫిక్సే అని… ఇప్పుడు తన కొడుకు సినిమా కూడా ఆ కారణం చేతనే వాయిదా పడిందని చెప్పుకొచ్చాడు. 

బాహుబలి స్టాండర్డ్స్ గురించీ, బాహుబలి నిర్మాణ శైలి గురించీ మాట్లాడేసి ” బాహుబలి స్థాయి లో మీ సినిమా ఉంటుంది అన్న మాట” అనే ప్రశ్నని పుట్టించారు నాగార్జున. బాహుబలి సినిమా కి కాదు కదా కనీసం ట్రైలర్ కి స్థాయి ని కూడా చేరుకోగల సినిమా తీయడం ఎవరికీ సాధ్యం కాదు. కంటెంట్ లో ఏమో కానీ గ్రాఫిక్స్ లో మాత్రం బాహుబలో తో పోల్చడం అసలు అత్యాస అవుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -