Saturday, April 20, 2024
- Advertisement -

అమ్మాయిలను ఆకర్షించాలంటే ఇలా చేయండి!

- Advertisement -

స్త్రీని ఆకర్శించటానికి పలు మార్గాలున్నాయి, అయితే వీటిలో సరైన మార్గాన్ని ఎన్నుకోవటం కష్టం అని చెప్పవచ్చు. ఇలాంటి ప్రయత్నం చేసేటప్పుడు హద్దులు నిర్ణయించుకొని, తరువాత ఎలా చేయాలో ప్రణాళిక తయారు చేసుకోవాలి.

ఆమె మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మీ హృదయంలో వేదన కలుగుతుంటుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఈ లోకంలో సాధించలేనిది ఏది లేదనే విషయం మరవకండి. దీనికి నిర్ధిష్టత మరియు అవగాహన అవసరం. మగువను ఆకర్షించటం చాలా కష్టమైన పని మరియు దీనిలో మీరు నైపుణ్యం కలిగి ఉండాలి. ఆరంభంలో కొన్ని సులభమైన నియమాలు మరియు సూత్రాలు పాటిస్తే మీరు పోటీలో ఉండటమేకాకుండా, ఇతరులకంటే ఈ ప్రయత్నంలో ముందుంటారు.

* మీరు చేయాల్సిన ముఖ్యమైన మరియు మొదటి పని- స్నేహంగా ఉండటం. మీ ప్రవర్తన కానీ, ఇతర విషయాలు, ఇతరులు మిమ్మల్ని ఇష్టపడే విధంగా ఉండాలి. ఒక స్త్రీ మీతో స్నేహ పూర్వకంగా మాట్లాడాలంటే ఆమె మిమ్ములను ఇష్టపడాలి. మీరు స్నేహజీవి కానప్పుడు ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేయటం మానుకోవటం మంచిది.

* మీరు మగవారైతే, స్త్రీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడటానికి భయపడకూడదు. ఇలా చేస్తే మీరు చాలా వ్యత్యాసాన్ని గమనించగలరు. స్త్రీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం, స్త్రీతో చనువుగా మాట్లాడటానికి మరియు ఆమెను ఆకర్షించటానికి ఒక మంచి మార్గంగా చెప్పవచ్చు.

* ఆమె కళ్ళలోకి కొంచం సేపు చూస్తూ ఉండండి ఆ తర్వాత కొంచం సేపు మీ దృష్టిని పక్కకు తిప్పండి, మరల ఆమె కళ్ళలోకి చూడండి. ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసిన వెంటనే మీరు మంచి పని చేసానన్న భావన ఆమెకు అర్థం అయ్యేలా మీ ప్రవర్తన ఉండాలి.

* నిగూడంగా ఉండేవారిని స్త్రీలు ఇష్టపడుతారు. నీ జీవితం తెరిచిన పుస్తకం కాకూడదు. ఇలా ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఎప్పటికి ఆమెకు తెలియకూడదు.

* సహనం కలిగి ఉండి మర్యాదతో ప్రవర్తించాలి అయితే అదే సమయంలో చాలా ధైర్యంతో కూడా ఉండాలి. మీరు ఆమెకు రాత్రిపూట మెస్సేజ్ పంపి చాలా సమయం చాట్ చేయవచ్చు ఇలా చేస్తున్నప్పుడు మీ సంభాషణలో  కొంటె పదాలను వాడవచ్చు. అయితే ఈ విషయాలను మీరు ఆమెను కలిసినప్పుడు తిరిగి ప్రస్తావించకూడదు. ఆమెను కలిసినప్పుడు మర్యాదగా ఉండాలి అంతేకాకుండా మీ ఆకతాయితనాన్ని మరచిపోవాలి.

* ఆమె మీ ఉనికిని గుర్తించేలా చేయాలి. ఆమెకు మీరు చేరువవ్వాలి అంటే చాలా దగ్గరవ్వాలని కాదు. మీరు ఆమెకు దగ్గరకు వెళ్ళటానికి ముందు మీ శరీరం దుర్వాసన లేకుండా చూసుకోవాలి. ఆమెకు ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా వెళ్ళండి అయితే భయపడకూడదు.

* మీరిరువురు కంపోర్ట్ జోన్లో ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి. మీకు సమయం దొరికినప్పుడు ఫ్లర్టింగ్ కు కొంచం విరామం ఇచ్చి ఆమెతో బాగా మాట్లాడాలి. ఇది వ్యక్తిగత విషయాలను మాట్లాడుకొనే సమయం ఇలా చెయ్యటం వలన ఆమె మీతో సౌకర్యంగా ఉంటుంది. దీని తర్వాత మీలో ఉద్రిక్తత మెదలవుతుంది. ఇలాంటి సమయంలో ఆమెను ముట్టుకోండి అంటే మరీ గట్టిగా కాదు ఆమెకు దగ్గరగా వెళ్ళండి తిరిగి వెనక్కి రండి. ఇలా చేస్తున్నపుడు ఆమె మీ శరీర స్పర్శను కోరుకోనివ్వండి.

* ఇతరులు చెప్పే విషయాలకంటే, మీ సొంత ఆకర్షణ ఆధారంగా మీరు ప్రయత్నం చేయండి. మీరు మీ శిరస్సు నుండి కింది వరకు ఆకర్షనీయంగా ఉండనవసరం లేదు. మీకున్నటువంటి ఆకర్షణ మీదే మీరు ఆధారపడాలి. ఒక స్త్రీ మిమ్ములను ఆకర్షించాలంటే మీరు మీరుగానే ఉండాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -