బీజేపీతో స్నేహం విషయంలో టీడీపీ శ్రేణులు కాస్త సీరియస్ గానే స్పందిస్తున్నాయి, వారితో ప్రత్యేక హోదా విషయంలో తప్ప అన్ని విషయాలమీదా స్నేహం చేస్తాం అనీ, ” కేంద్రాన్ని నిలదీస్తాం” అనీ ఈ మధ్య కొందరు టీడీపీ నేతలు పేలడం వెనక చంద్రబాబు హస్తం ఉంది అని సమాచారం. ఈ విషయం మీదే బీజేపీ నేతలు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో తమ జాగ్రత్త లో తాము ఉండాలి కాబట్టి చంద్రబాబు గారి “లెక్కలు” తవ్వడం మొదలు పెట్టారట. దీనికి ఒక ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు కాబడింది అని ఆ బృందానికి పవన్ కళ్యాణ్ కి బాగా క్లోజ్ అయిన సోము వీర్రాజు నాయకుడు అని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి.
ఈ మధ్య కాలం లో ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు సైలెంట్ గా ఉండడం, సోము వీర్రాజు ఆ సమయంలోనే చాలా యాక్టివ్ గా కనపడ్డం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ ప్రభుత్వం ని ఎకేయడం మొదలు పెట్టిన వీర్రాజు అప్పుడు కాస్త లైం లైట్ లోకి వచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులు తినడం మొదలు పెట్టి సరైన రీతిలో ప్రభుత్వం ఖర్చుపెట్టట్లేదు అనేది వారి తీవ్ర ఆరోపణలు. అవడానికి మిత్రపక్షాలు కానీ వీరు ఒకరిమీద ఒకరు ఇలా దూషించుకోవడం చాలా వింతైన విషయం. ఇప్పుడు ఈ విషయం మీద గట్టి శ్రద్ధ తీసుకుని మరీ వచ్చిన నిధులు ఇంతా ? చంద్రబాబు చేస్తున్న ఖర్చులు ఎంతా? అనేదాని మీద పెద్ద లేక్కల్నే సిద్దం చేస్తున్నారు వీర్రాజు.ఇందులో, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ‘డాబు కోసం చేసిన ఖర్చుల్ని’ ప్రత్యేకంగా పేర్కొనబోతున్నారట. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హేలీకాప్తర్ లలో అనవసర తిరుగుళ్ళు కి సంబంధించిన ప్రతీ ఖర్చూ ఆయన లెక్కల్లో కనిపిస్తాయి. కేంద్రం ఇప్పటికే ప్రత్యేక హోదా అడిగిన ప్రతీసారీ నీతి అయోగ్ పేరును ప్రస్తావించి నీరు గారుస్తున్న విషయం తెలిసిందే.
నీతి ఆయోగ్ ఏపీ పరిస్థితి ని పూర్తిగా బేరీజు వేస్తోంది, ఇంకా వేస్తూనే ఉంటుంది కూడా. ప్రభుత్వం వృధా ఖర్చులు చెయ్యడం అంటే ఆర్ధికంగా సూపర్ స్థితిలో ఉన్నట్టే కదా అనే సంకేతాలు వారికి అందుతాయి. దీన్ని క్యాష్ చేసుకుని చంద్రబాబు ని ఇరకాటం లో పెట్టే పనిలో బిజీ గా ఉంది బీజేపీ. అమరావాతి శంకుస్థాపన కి నాలుగొందల కోట్లు ఖర్చు అయ్యాయి అనేది ఒక అంచనా కాగా కేవలం తొమ్మిది కోట్లే అనేది బాబు సర్కారు మాట. ప్రభుత్వంలో ఎలాగూ బీజేపీ కి చెందిన మంత్రులు, ఉద్దండులు, ఎమ్మెల్సీ లు ఉండగా లెక్కలు దొరకడం బీజేపీ కి పెద్ద ప్రశ్నే కాదు. ఈ లెక్కలు బయటకి తీసి నీతి అయోగ్ కి సైలెంట్ గా అందించి, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంకా తప్పు దోవ పట్టించాలి అనేది వీరి ఆలోచన గా తెలుస్తోంది.
కారణాలు ఏవైనా ప్రత్యేక హోదా విషయంలో అవసరమైన చాలా లక్షణాలు ఏపీ కి లేనపుడు దుబరాకీ, దాబుకీ డబ్బు ఖర్చుపెడుతూ స్వయంగా ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది అని చూపిస్తే బాబు ఇంకా ఇరకాటంలో పడతారు కదా ? అదనమాట బీజేపీ ప్లాన్.