Tuesday, May 6, 2025
- Advertisement -

చైనాలో ట్రాఫిక్ జామ్ కూడా వ్యాపారమే…

- Advertisement -

చైనాలో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెపుకోనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయితే.. గంటల నుంచి రోజుల తరబడి వాహనదారులు నిరీక్షించాల్సి ఉంటుంది.

కొన్ని సందర్బాల్లో ట్రాఫిక్ విభాగం దాన్ని క్లియర్ చేయలేక చేతులు పైకెత్తేసిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. దీన్నుంచే ఓ కుర్రాడికి తన  బుర్రలో  ఓ పదునైన ఆలోచన మెరిసింది. ఆలోచన రావడమే తరువాయి దాన్ని అమల్లో పెట్టేశాడు.

అదేంటంటే…. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడికి మీరు కాల్ చేసినట్లయితే తన  సర్వీస్ విభాగానికి చెందిన ఏజెంట్ వచ్చి మనకు సేవ చేస్తాడు. అతను మనల్ని అక్కడనుంచి సురక్షిత మార్గంలో మన గమ్యానికి  చేర్చుతాడు. మన కారును కూడా ట్రాఫిక్ క్లియర్ అయ్యాక మన ఇంటికి తెచ్చిస్తాడు. దీంతో మనకు పైసలు పోయినా… చిరాకు, అలసట లేకుండా పోతోంది. ప్రస్తుతం ఈతరహా దందా చైనాలో బాగా ఊపందుకుంటోంది. 

ఒకడికి వచ్చిన ఈ ఐడియా, ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడుతోందట. ఇలాంటి వ్యాపారాలతో చైనాలో చాలా మంది బతికేస్తున్నారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటుంటారు. ఇలాంటివి విన్నప్పుడు, చదివినపుడు నిజమేననిపిస్తుంది. ఆ కుర్రాడు ఎవరో కాని ఇంటెలిజెంట్ గాయ్ జనాల పల్స్‌ని అట్టే పట్టేశాడు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -