Wednesday, May 1, 2024
- Advertisement -

ప్రభాస్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఓ డియర్’ లేదా ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ అనుకుంటున్నారు. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి1, బాహుబలి2 కలిపి లాభాల్లో వాటాగా 80 కోట్ల వరకూ అందుకున్నాడు ప్రభాస్. ఇక సాహో సినిమా తన ఫ్రెండ్స్ నిర్మించారు కాబట్టి ఆ సినిమాకు ఎలాంటి పారితోషకం తీసుకోలేదని ప్రభాస్ చెప్పాడు.

ఆ సినిమా ప్లాప్ టాక్ వచ్చిన 230 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 150 కోట్ల వరకూ అందినట్టు సమాచారం దాంతో… ఆ చిత్రం నిర్మాతలకు సేఫ్ వెంచర్ అనే చెప్పాలి. ఇక తన తరువాతి చిత్రానికి కూడా లాభాల్లో వాటా లేదా నాన్ థియేట్రికల్స్ రైట్స్ రూపంలో 60 కోట్ల వరకూ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో ప్రభాస్ చేసే చిత్రానికి దాదాపు 80 కోట్ల వరకూ అందుకునే ఛాన్స్ ఉందట.

ఇక సినిమాలను పక్కన పెడితే ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజు గారు చెన్నై లో స్థలాలను అప్పటి రోజుల్లోనే కొనుగోలు చేసారట. ఇక హైదరాబాద్ సమీపంలో కూడా స్థలాలు ఉన్నాయట. ప్రభాస్ కు ప్రస్తుతం 4 కార్లు ఉన్నాయి. హైదరాబాద్ లో రెండు ఇల్లు ఉన్నాయి. బెంగుళూరు నగరంలో కూడా స్థలం ఉందట. అంతే కాకుండా గ్రానైట్ భూమి, కొబ్బరి తోటలు వంటివి కూడా ఉన్నాయట. మొత్తంగా కలుపుకుంటే సుమారు 6.5 వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -