Tuesday, May 13, 2025
- Advertisement -

డ్రామోజీ……. జర్నలిజం నీతులు చెప్పడానికేనా? పాటించేది లేదా?

- Advertisement -

తెలుగు దేశం క్యాంప్ అంతా కూడా జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అని అస్తమానం చెప్తూ ఉంటారు. మోడీతో పొత్తుపెట్టుకోవడం కోసం జగన్ సాగిలపడుతున్నాడని బాబు బ్యాచ్‌తో పాటు పచ్చ మీడియా సంస్థలు కూడా వాపోతూ ఉంటాయి. మరి అదే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్రమోడీ తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తున్నా ఎందుకు ఇంకా మోడీ కాళ్ళ దగ్గర సాగిలపడి ఉన్నాడు అని మాత్రం ఒక్కరు కూడా ప్రశ్నించరు. అలా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు అభివృద్ధి నిరోధకులు అని రాగాలు తీస్తారు.

రెండేళ్ళ క్రితమే ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉధృతంగా చేద్దామనుకున్న జగన్ ప్రయత్నాన్ని పోలీసుల అండతో, 144సెక్షన్‌తో, పచ్చ మీడియా కుట్రలతో విజయవంతంగా అడ్డుకున్నాడు చంద్రబాబు. పవన్ కూడా విద్యార్థినీ, విద్యార్థులు ఆందోళనలలో పాల్గొనద్దని గొప్ప పిలుపిచ్చాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు బడ్జెట్‌లో గత నాలుగేళ్ళుగా చిప్ప చూపిస్తున్నట్టుగానే మరోసారి మోడీ చిప్ప చూపించాక చంద్రబాబుతో పాటు ఆయన భజన బ్యాచ్ అంతా మరోసారి హంగామా చేశారు. పచ్చ మీడియా కూడా రెచ్చిపోయింది. ప్రజల్లో కూడా తీవ్రస్థాయిలో ఆవేధన ఉంది. అందుకే జగన్ కూడా ఈ సారి ఎలా అయినా సక్సెస్ అవ్వాలన్న ఉద్ధేశ్యంతో ప్రత్యక హోదా కోసం ధర్నాలు, ఢిల్లీ వేదికగా ఆందోళలనలు, ఆ తర్వాత ఎంపిల రాజీనామాలు, అవసరమైతే ఎమ్మెల్యేల రాజీనామాల వరకూ కూడా మొత్తం రోడ్ మ్యాప్ ప్రకటించాడు. నిజానికి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి ఉన్నవాళ్ళయితే పచ్చ బ్యాచ్ కూడా జగన్‌ పోరాటానికి మద్దతివ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే ఉన్నామని చెప్పుకునే రామోజీరావు, రాధాకృష్ణలు మాత్రం జగన్‌కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అన్న తాపత్రయంతో రెండేళ్ళ క్రితం ప్రజల ఆవేధనను విజయవంతంగా అణచివేసినట్టే మరోసారి చేయడానికి ఫిక్స్ అయ్యారు. అమరావతి గ్రాఫిక్స్‌ని మరోసారి తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ ఎడిషన్‌లో కూడా అమరావతి గొప్పతనం, గ్రాఫిక్స్‌కి భారీ కవరేజ్ ఇచ్చారు. చంద్రబాబు భజన బ్రహ్మాండంగా చేశారు. ఆ రకంగా జగన్ చేపట్టిన భారీ పోరాట కార్యక్రమం హైలైట్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఇక హైదరాబాద్ ఎడిషన్‌లో హోదా కోసం ఎంపిలు అందరి చేతా రాజీనామా చేయిస్తానన్న జగన్ మాటలు కానీ, ఢిల్లీ వేదికగా ధర్నాలు చేస్తామన్న రోడ్ మ్యాప్ గురించి కానీ మచ్చుకు కూడా ఒక్క వార్త కూడా కనిపించలేదు. సీమాంధ్ర ఎడిషన్స్‌లో కూడా మమ అనిపించారు.

కానీ జగన్ ఎందుకు రాజీనామాలు చేస్తున్నాడు? జగన్ నిర్ణయం వెనకాల స్వార్థం ఏంటి? ఏం రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి? అంటూ జగన్ పోరాటంపై జనాలకు నమ్మకం లేకుండా చేసే వార్తలు మాత్రం బ్రహ్మాండంగా అచ్చుగుద్దారు. తెలంగాణా ఉద్యమం సమయంలో కూడా సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షను చేపట్టిన జగన్ విశ్వసనీయతను ఇలానే దెబ్బతీశారు. సోనియాతో కుమ్మక్కు అన్నారు. ఇప్పుడు హోదా కోసం ఉద్యమం చేస్తాను. ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు చేస్తాను, ఎంపిల చేత రాజీనామాలు చేయిస్తాను అని జగన్ అంటే కూడా అదే విధంగా మోడీతో కుమ్మక్కు అని రాస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమీ చేయలేడు. తన పార్టీ కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించలేడు. కనీసం బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటినుంచీ బాబు మీడియా ముందుకు వచ్చి ఒక్క మాట అన్నా మాట్లాడాడా? 14రోజులుగా అజ్ఙాతవాసం చేస్తున్నాడు. తాను చీకటిలో ఉండి పచ్చ మీడియాలో బాబు ఆవేశం, బాబు ఆగ్రహం, బాబు రంకెలు, బాబు చిందులు అంటూ రాతలు రాయిస్తున్నాడు. అయినప్పటికీ బాబుది బ్రహ్మాండమైన పోరాటం లాగా పచ్చ మీడియాకు కనిపిస్తుంది. ఎంపిల చేత రాజీనామా చేయిస్తా…..ఢిల్లీ వేదికగా ధర్నాలు చేస్తా అన్న జగన్ మాత్రం మోడీతో కుమ్మక్కయినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు అజ్ఙాతవాసంలో ఉంటూ మాట్లాడాడు అన్న కథలకేమో హైదరాబాద్ ఎడిషన్‌లో కూడా ప్రాధాన్యత దక్కుతుంది. ప్రజల సమక్షంలో….మీడియా సాక్షిగా… ఎంపిల రాజీనామాతో సహా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేయబోయే పోరాట పంథాను వివరించిన జగన్ మాటలకు మాత్రం కనీస ప్రాధాన్యత కూడా దక్కదు.

రాజకీయ వ్యవహారాల్లో ఒకే కానీ కనీసం ప్రజలకు సంబంధించిన విషయాల్లో అయినా తెలంగాణాలో ఉన్న నాయకులు, మీడియా, సమాజం మొత్తం కదిలినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశం లేదా? ఎప్పిటికీ ఉండదు. అలా లేకుండా చేసేది కూడా మీడియానే. ఎందుకంటే ఎల్లో మీడియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కంటే బాబు అధికారంలో ఉండడం, వర్గ ప్రయోజనాలు చాలా ముఖ్యం మరి. జర్నలిజం ఎథిక్స్‌ గురించి మాటల్లో మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. ఆచరణలో మాత్రం పక్షపాతానికి పరాకాష్టలా ఉంటుంది వ్యవహారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -