పాప్ కార్న్ తింటున్నారా.. అయితే మీ కోసమే !

Eeating Popcorn Know these things!
Eeating Popcorn Know these things!

పాప్ కార్న్ అనేది అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్స్. ఎప్పుడైనా మూవీస్ కి వెళ్ళినప్పుడు, లేదా సరధగా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకునే టైమ్ లోనూ లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో టీవి చూసే టైమ్ లోనూ ప్రధాన స్నాక్స్ ఐటమ్ గా పాప్ కార్న్ ఉంటుంది. అయితే పాప్ కార్న్ తినడం వల్ల కలిగే లాభాల గురించి మాత్రం చాలమందికి తెలియదు. పాప కార్న్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం !

పాప్ కార్న్ ముక్కజొన్న తో తయారు చేస్తారు. ముక్కజొన్నలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి. దాంతో అజీర్తి మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇంకా పాప్ కార్న్ లో ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. తద్వారా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇంకా పాప్ కార్న్ లో ఉండే ఎండోస్పెర్మ్, జెర్మ్ వంటివి జీర్ణక్రియను మెరుగుపరిచి పెద్ద ప్రేగు కదలికలకు దోహదపడుతుంది.

పాప్ కార్న్ తినడం వల్ల గుండె సమస్యలు కూడా తగ్గుతాయని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. రక్తనాలల్లోని కొవ్వు శాతాన్ని తగ్గించి రక్త సరఫరాను సమతుల్యం చేయడంలో కూడా పాప్ కార్న్ సహాయ పడుతుంది. ఇక పాప్కార్న్ లో ఉండే మాంగనీస్ కారణంగా ఎముకలు దృఢంగా మారతాయి. ఆస్టియోపోరిసిస్, కీళ్లనొప్పులు వంటి ఎముకల వ్యాధులు దూరం అవుతాయి. ఇక పాప్కార్న్ లో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ ఐరన్ మగవారికి 8mg, ఆడవారికి 18mg అవసరం అవుతుంది. అందువల్ల ఐరన్ అధికంగా ఉండే పాప్ కార్న్ తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read

డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

మీ చేతులు అందంగా, మృదువుగా మారాలంటే ఇలా చేయండి..