Sunday, May 11, 2025
- Advertisement -

జగన్‌లో వచ్చిన మార్పుకు గ్రాండ్ సర్టిఫికెట్…… జగన్ వ్యక్తిత్వం@ది బెస్ట్

- Advertisement -

కాంగ్రస్ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకున్న మరుక్షణం నుంచీ టిడిపి, కాంగ్రస్ నేతలందరూ జగన్ వ్యక్తిత్వం గురించి విష ప్రచారం చేశారు. చంద్రబాబులా జగన్ వేరొకరి పార్టీని లాక్కోలేదు….ఇంకొకరి కష్టంతో వచ్చిన కుర్చీలో కూర్చోవాలని అనుకోలేదు. ధైర్యంగా రాజీనామా చేసి, తల్లి విజయమ్మ చేత కూడా రాజీనామా చేయించి రాజకీయ వ్యూహాలు, కుట్రలు రచించడంలో అగ్రగణ్యుడైన, ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో పాటు, అప్పట్లో ఢిల్లీ రాజకీయాలు శాసిస్తున్న సోనియాను ఎదుర్కున్నాడు. జగన్‌ని ఒంటరిగా ఎదుర్కునే శక్తిలేక సోనియా, చంద్రబాబు చీకటి రాజకీయాలు చేసినప్పటికీ జగన్ మాత్రం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పోరాడారు. జగన్ తలవంచకపోవడం నచ్చని టిడిపి జనాలు, పచ్చ మీడియా సంస్థలు జగన్‌ని పొగరుబోతు అని ప్రచారం చేశారు.

వైఎస్‌కి సన్నిహితులైన నేతలు కూడా జగన్ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం లేక, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, కుట్రలకు భయపడి బాబుకే మద్ధతు తెలిపారు. అయితే ఇప్పుడు 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిస్థితులు తిరగబడుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం తర్వాత నుంచీ కూడా జగన్ వ్యక్తిత్వాన్ని కించిత్తు కూడా అనుమానించాల్సిన పరిస్థితులు లేకుండా పోయాయి. అందుకే టిడిపి, పచ్చ మీడియా సంస్థలు కూడా ఇప్పుడు జగన్ వ్యక్తిత్వం గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నాయి. టిడిపి సీనియర్ నేతల కుటుంబాల్లో నుంచి కూడా ఆయా నేతల వారసులు చంద్రబాబు, లోకేష్‌లకంటే జగన్‌నే ఎక్కువ నమ్ముతున్నారు. టిడిపి సీనియర్ నేతలు కూడా అంతర్గతంగా జగన్ సంకల్పాన్ని మెచ్చుకుంటున్న పరిస్థితి.

తాజాగా ఆ లిస్టులో సాయిప్రతాప్‌ కూడా చేరాడు. అప్పట్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో రాధాకృష్ణతో కలిసి జగన్ వ్యక్తిత్వం గురించి విమర్శలు చేస్తున్న నాయకుల్లో సాయిప్రతాప్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు తాజాగా టిడిపిలో ఉన్న ఈ సీనియర్ మోస్ట్ నాయకుడు జగన్ ప్రజాబలం గురించి, ప్రజల కోసం జగన్ పడుతున్న తపన గురించి……అనుక్షణం ప్రజల మధ్యలోనే ఉంటున్న వైనం గురించి గొప్పగా ప్రశంశలు కురిపించాడు. ఒక టిడిపి సీనియర్ నేత జగన్‌ని ఈ స్థాయిలో ప్రశంసించడం నిజంగానే జగన్ వ్యక్తిత్వానికి బెస్ట్ సర్టిఫికెట్ లాంటిదే. అప్పట్లో ఎబిఎన్ స్టూడియో కూర్చోపెట్టి మరీ ఇదే సాయిప్రతాప్‌రెడ్డి చేత జగన్‌పై విమర్శలు చేయించిన రాధాకృష్ణ ఇప్పుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. ఏది ఏమైనా పాదయాత్ర సమయంలోనే తనపై ఉన్న ఫ్యాక్షన్ ముద్రను పూర్తిగా తొంగించుకున్న వైఎస్ లాగే వైఎస్ జగన్ కూడా అదే పాదయాత్రతోనే తన వ్యక్తిత్వంపై వచ్చిన విమర్శలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెడుతుండడం గమనార్హం. ఫాం హౌస్ రాజకీయాలు, హైటెక్ ప్రచార రాజకీయాల కంటే కూడా పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ కూడా అనుక్షణం ప్రజల మధ్యనే ఉంటున్న, ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడి రాజకీయాలు కావాలని సీమాంధ్ర జనం అనుకుంటే మాత్రం 2019లో వైకాపాకు తిరుగే ఉండదు అని రాజకీయ అభిప్రాయాలు కూడా విశ్లేషణలు చేస్తూ ఉండడం వైకాపాకు బిగ్గెస్ట్ బూస్ట్ లాంటిదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -