Friday, May 9, 2025
- Advertisement -

కేరళ లో అల్లూ అర్జున్

- Advertisement -

అల్లు అర్జున్ కి కేరళలోను మంచి మార్కెట్ వుంది. అందువలన ఆయన సినిమాలు అక్కడి ప్రేక్షకులను కూడా పలకరిస్తుంటాయి. అక్కడ యనకి ఎంతో క్రేజ్ వుండటం వల్లనే, ఆర్య .. రేసుగుర్రం .. సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు సక్సెస్ ను అందుకున్నాయి. అందువలన ఆయన తాజా చిత్రం ‘సరైనోడు’ సినిమాను కూడా మలయాళంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు.

 ‘యోధవ్ ది వారియర్’ అనే టైటిల్ తో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. తప్పకుండా ఈ సినిమా అక్కడి ఆడియన్స్ ను కూడా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, రకుల్ .. కేథరిన్ కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన వైజాగ్ లో ఆడియో సెలబ్రేషన్స్ ను జరుపుకుని, 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -