- Advertisement -

హోమియోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్స్?

- Advertisement -

హోమియోపతి మందులకు నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే దీనిపై నిపుణులు చెబుతున్న ప్రకారం… హోమియోపతి ఒక సున్నితమైన మరియు సురక్షితమైన వైద్య విధానం. సరైన విధంగా ఉపయోగిస్తే సాధారణంగా హానికరమైన దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు.

శరీరంలోని సహజ స్వస్థత శక్తిని ప్రేరేపించేందుకు అత్యల్ప మోతాదులోనే మందులు ఇవ్వడం. దీంతో అనవసర ప్రతిక్రియలు తగ్గుతాయని భావిస్తారు. అలాగే హోమియోపతి మందులు “పోటెన్టైజేషన్” అనే ప్రత్యేక విధానంతో తయారు అవుతాయి. ఇవి రసాయన ప్రభావం కంటే శరీరంపై సున్నితమైన స్థాయిలో పనిచేస్తాయి.

ఈ కారణాల వల్లే హోమియోపతి శిశువులు, గర్భిణీలు, వృద్ధులు వంటి అన్ని వయస్సుల వారికి కూడా సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. ఇది శరీరంతో కలిసి పనిచేసే చికిత్స విధానమని నిపుణులు చెబుతున్నారు.

అయితే, సరైన డాక్టర్ సలహా లేకుండా వాడటం మంచిది కాదు. ప్రొఫెషనల్ వైద్యుల సూచనతోనే హోమియోపతి మందులు వాడాలి. సరైన మందు ఎంపిక ఎంతో కీలకం.

గమనిక: పై సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వైద్య సూచనల కోసం తప్పనిసరిగా నిపుణులను సంప్రదించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -