Saturday, May 18, 2024
- Advertisement -

మోడీని మేనేజ్ చేయడంలో తన కంటే జగన్ సమర్థుడని బాబు ఒప్పుకున్నట్టేనా?

- Advertisement -

అధికారంలో ఉన్న చంద్రబాబే మోడీని ప్రభావితం చేయలేకపోయాడు. తన చేతకానితనాన్ని ఒప్పుకుని మోసపోయాను అంటూ బేల మాటలు మాట్లాడుతూ ప్రజల సానుభూతి కోసం చూస్తున్నాడు. అయితే అధికారంలో లేని జగన్ మాత్రం ఏకంగా మోడీనే ప్రభావితం చేస్తున్నాడా? బిజెపి అధ్యక్షుడిని నియమించే విషయంలో మోడీకే జగన్ దిశానిర్దేశం చేశాడా? మోడీని ఆ స్థాయిలో జగన్ మేనేజ్ చేస్తున్నాడా? సొంత పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల మాటలను కూడా పట్టించుకోని మోడీ జగన్‌కి ఆ స్థాయిలో ఎందుకు సరెండర్ అయ్యాడు? జగన్ చెప్పినట్టుగా ఎందుకు వింటున్నాడు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఈ ప్రశ్నలకు సమాధానం కూడా టిడిపి నేతలే చెప్పాలి. ఎందుకంటే మోడీని జగన్ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నది బాబు అండ్ కోనే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమించబడ్డాడు. బిజెపి అధ్యక్షుడిగా కన్నాను నియమించమని మోడీకి చెప్పింది జగనేనట. జగన్ ఆదేశానుసారమే కన్నాను బిజెపి అధ్యక్షుడిగా నియమించారట మోడీ అండ్ కో. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబుకు సన్నిహితుడు, టిడిపి సీనియర్ లీడర్ బాబూ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక టిడిపి మీడియాతో సహా ఆ పార్టీ నాయకుల మాటలు అన్నీ ఇలానే సాగాయి. జగన్ చెప్పినట్టుగా మోడీ వింటున్నాడని, మోడీని జగన్ మేనేజ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.

టిడిపి నాయకులందరూ కూడా మోడీ ఏదో జగన్ జేబులో బొమ్మ అనేస్థాయిలో మాట్లాడుతూ జగన్‌ని విమర్శస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ అదికారంలో ఉన్న చంద్రబాబు మోడీని ఏమీ చేయలేక, మోడీ నుంచి కనీస స్థాయి ప్రయోజనాలు రాబట్టలేక చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే ……అధికారంలో లేని జగన్ మోడీని ఆ స్థాయిలో ఎలా మేనేజ్ చేస్తున్నాడు? నిజంగా జగన్ అధికారంలో ఉండి ఉంటే మోడీ నుంచి ప్రత్యేక హోదాతో సహా అన్ని ప్రయోజనాలూ రాబట్టేవాడా? ఆ విషయం పక్కనపెట్టినా కచ్చితంగా చంద్రబాబులా చేతకానితనం చూపించకుండా కాస్తైనా రాష్ట్రానికి మంచి జరిగేలా మోడీని ప్రభావితం చేసి ఉండేవాడా? అనే కోణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే మాత్రం 2019 ఎన్నికల్లో టిడిపి పుట్టి పూర్తిగా మునగడం ఖాయం. 2014లో అంతన్నాడింతన్నాడే అనే సామెతలాగా ఎన్నో కబుర్లు చెప్పిన బాబు ఇప్పుడు చేతకాని కబుర్లు చెప్తున్నాడు. అదే సమయంలో అదే మోడీని మేనేజ్ చేయగల సమర్థుడు జగన్ అని టిడిపి నేతలే పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. అంటే ఎవరు సమర్థుడైన నాయకుడు అన్నట్టు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -