సాహసానికి మరో పేరు సీఎం జగన్. టార్గెట్ 175. ప్రతీ సీటు గెలవాల్సిందే. పొత్తులతో వస్తున్న ప్రతిపక్షాలను చిత్తు చేయాల్సిందే. ఇదీ జగన్ లక్ష్యం. ఇందులో భాగంగానే శాసనసభ్యులను తప్పించడమో లేక వారికి స్థాన చలనం చేయడమో జరిగింది. తన ఎమ్మెల్యేలు..పార్టీ నేతల పైన జగన్ కు ఉన్న నమ్మకం. పట్టు నిరూపణకు ఇది ఒక ఉదాహరణ. జగన్ ఏ నిర్ణయమైనా సాహసోపేతంగానే ఉంటుంది. జగన్ లెక్కలు ఓ పట్టాన ఎవరికీ అర్దం కావు. సగం అర్దమైన చంద్రబాబు..అసలు అర్దం కాని పవన్ కు ఈ నిర్ణయాలతో షేకింగ్ మొదలైంది. జగన్ తీసుకొనే ఏ నిర్ణయమైన అంతిమంగా పార్టీ అధికారంలోకి రావటం. పార్టీని నమ్ముకున్న ప్రతీ ఒక్కరికీ గుర్తింపు దక్కటం. పార్టీని ఆశగా మలచుకున్న కోట్లాది మంది పేదలకు ధైర్యం ఇవ్వటం.
ముఖ్యమంత్రి జగన్ నాలుగు నెలల క్రితమే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనే సీట్ల కేటాయింపు, కొందరి మార్పుపై ప్రకటన చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు ఇచ్చి దెబ్బతిన్నారన్న అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే సీఎం జగన్ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేమని చెబుతూ వచ్చారు. ఆ కారణంగానే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఆయన సిద్దపడ్డారు. వచ్చే ఎన్నికలు ఎమ్మెల్యే అభ్యర్దులపై కన్నా ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న విశ్వాసాన్ని కనబరిచే ఎన్నికలుగా ఉండే అవకాశం అధికంగా ఉంది. అలా అని ఎమ్మెల్యే అభ్యర్దులకు ప్రాధాన్యత లేదని కాదు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేది ముఖ్యమంత్రి కనుక ఆయనే కీలకం అవుతారు.
ఎమ్మెల్యేల మార్పు వైఎస్సార్‌సీపీ గెలుపునకు మరో సంకేతమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ ఒకసారి నిర్ణయం చేశాక సాధారణంగా వెనక్కి తగ్గడం అంటూ జరగదు. మరో మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో టీడీపీ కన్నా వేగంగా పార్టీ అభ్యర్ధుల విషయంలో స్పందిస్తున్నారు. మంత్రులు..ఎమ్మెల్యేల సీట్లలో మార్పు ఎక్కడైనా పోటీ చేయించే దమ్ము సీఎం వైయస్ జగన్‌కు ఉంది. జగన్ సోషల్ ఇంజనీరింగ్ చంద్రబాబుకు అంతు చిక్కటం లేదు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆళ్ల లాంటి సన్నిహితుడిని కాదని గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబులో టెన్షన్ ఎందుకంటే దీని వెనుక అసలు ముప్పు ఏంటో చంద్రబాబుకు అర్దమైంది.
జగన్ 2019 ఎన్నికల నుంచి సోషల్ ఇంజనీరింగ్ లో ప్రతిపక్షాలకు అర్దం కాని రీతిలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు బీసీ వర్గాలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రిజర్వ్ అయిన నియోజకవర్గాల ను మినహాయిస్తే మిగిలిన సీట్లలో ఈ సారి రెడ్డి వర్గానికి తగ్గించే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మెజార్టీ వర్గాలను దగ్గర చేసుకోవాలని జగన్ వ్యూహం. కానీ, ఈ అవకాశం చంద్రబాబు కు లేదు. చంద్రబాబు – పవన్ కాంబినేషన్ లో కమ్మ – కాపు వర్గాలకు మెజార్టీ సీట్లు ఇవ్వాలి. రెడ్లకు సీట్ల విషయంలో ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా బీసీల కు చంద్రబాబు సీట్లు స్వల్పంగానే ఇవ్వటం సాధ్యపడుతుంది. రెండు పార్టీలు ప్రధానంగా నమ్ముకున్న రెండు వర్గాలకు మెజార్టీ సీట్లు ఇవ్వటం..అదే సమయంలో జగన్ కు మాత్రమే బీసీలకు మెజార్టీ సీట్లు ఇవ్వటం ద్వారా రాజకీయంగా జరిగే నష్టం ఏంటో చంద్రబాబుకు అర్దమైంది. ఈ కారణమే వైసీపీ అంతర్గత వ్యవహారం అయినా సీట్ల మార్పు పైన గగ్గోలు మొదలు పెట్టారు.
బీసీలను మార్చినా బీసీలకే అవకావం ఇస్తున్నారు. ఎస్సీలను మార్చినా ఎస్సీ నేతలకు తిరిగి అవకాశం కల్పిస్తున్నారు. ఎక్కడా సామాజిక సమీకరణ బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరహా వెసులుబాటు చంద్రబాబుకు సాధ్యపడేది కాదు. జనసేన – టీడీపీ తో పాటుగా వారు చెబుతున్నట్లుగా బీజేపీ కలిస్తే ఎన్నికల్లో జగన్ విజయం ఏకపక్షమే. తమ రెండు పార్టీల పొత్తులతో ఎక్కడైతే జగన్ ను దెబ్బ తీస్తామని చెబుతున్నారో..అక్కడే జగన్ వేగంగా కదుపుతున్న పావులు..చంద్రబాబు ఆశలను వమ్ము చేస్తున్నాయి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికో లెక్క ఉంటుంది. జగన్ లెక్కలు ఏంటనేది టీడీపీ – జనసేన సీట్ల పంపకాలు..కేటాయింపుల సమయంలో పచ్చ పార్టీ నేతలకు అర్దమవుతోంది. జగన్ ఇంతలా దెబ్బ కొట్టాడా అని తలలు పట్టుకోవటం ఖాయం. వైసీపీ నేతలు జస్ట్ వెయిట్. చంద్రబాబు – పవన్ కు ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్.