Thursday, May 8, 2025
- Advertisement -

వైఎస్‌లకు, నారావారికి తేడా ఏంటో చెప్పిన పవన్… మెగా క్యాంప్‌లో చర్చ

- Advertisement -

విషయం తెలిశాక కానీ వివరం అర్థం కాదని సామెత. పవన్‌ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. చంద్రబాబుకు మద్దతిచ్చినంత కాలం పవన్ కళ్యాణ్ హీరో, నిజాయితీపరుడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు అంటూ పచ్చ బ్యాచ్ మొత్తం భజన చేసింది. ఒకసారి చంద్రబాబు, లోకేష్‌ల తప్పులు చెప్పడం మొదలెట్టేసరికి అదే పవన్‌ కళ్యాణ్‌ని అతి పెద్ద విలన్‌గా చిత్రీకరించడానికి చంద్రబాబు, లోకేష్‌ల స్థాయిలో కుట్రలు పన్నుతున్నారని పవనే చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌లకు చంద్రబాబు, లోకేష్‌లకు మధ్య ఉన్న తేడాను కూడా వివరించాడు పవన్.

2009 ఎన్నికల్లో వైఎస్సార్‌కి ప్రత్యర్థిగా చిరంజీవి పోటీచేశాడు. వైఎస్‌పై చిరంజీవి, పవన్‌లు చాలా విమర్శలే చేశారు. ఇక 2014 ఎన్నికల్లో జగన్‌కి లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్ అనే స్థాయి ఎన్నికల్లో చివరి క్షణంలో ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ బాబును గెలిపించాడు…జగన్‌ని ఓడించాడు. అయినప్పటికీ అప్పట్లో వైఎస్….ఇప్పుడు వైఎస్ జగన్‌లు ఎక్కడా కూడా చిరంజీవి, పవన్‌లపై వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యలేదు. ఇక తెరవెనుక కుట్రలు అనేవి వైఎస్‌లు ఎప్పుడూ చేయలేదు. చిరంజీవి, పవన్‌లను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగానే చూశారు. రాజకీయంగానే, ప్రజా బలంతోనే వాళ్ళను ఓడించాలని చూశారు.

అదే చంద్రబాబు విషయానికి వస్తే ప్రజా రాజ్యం సమయంలో కూడా ఎబిఎన్ ఆంధ్రజ్యోతిని, పరకాల లాంటి వాళ్ళను అడ్డుపెట్టుకుని చిరంజీవి వ్యక్తిత్వాన్ని, రాజకీయ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశారు. ఈ ప్రక్రియలో తెలుగు నంబర్ ఒన్ పత్రిక, రాజగురువు కూడా రాక్షస వ్యూహాలు రచించాడని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అవే తెరవెనుక బాగోతాలు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ హఠావో అని పిలుపిచ్చాడు పవన్. ఇక విభజనకు కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి అని కూడా చంద్రబాబుని మించి విమర్శలు చేశాడు. కానీ జగన్ మాత్రం పవన్‌కి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యాఖ్యలు చేసింది లేదు. పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా, వ్యక్తిగతంగా నష్టం చేసేలే వ్యూహరచన చేయలేదు జగన్. ముఖ్యమంత్రి కుర్చీ కోసమే రాజకీయాలు చేస్తున్నాడు అని ఏ పవన్ అయితే విమర్శలు చేశాడో……అదే పవన్ చేతకందిన కుర్చీని లాక్కుపోయి చంద్రబాబుకు ఇవ్వడంలో సహాయపడినప్పటికీ జగన్ మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. అదే అధికార యావే లేదు అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం తనకు వ్యతిరేకంగా నిలబడిన ఎవ్వరినైనా సరే కుట్రలతోనే సర్వనాశనం అయిపోయేలా చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్, చిరంజీవి, బిజెపి…..ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ విషయంలో కూడా చంద్రబాబుది అదే తీరు. అలాంటి చంద్రబాబును ఎదుర్కుంటూ నిజాయితీగా, ధైర్యంగా రాజకీయాలు చేసిన చరిత్ర వైఎస్, జగన్‌ది. ఇప్పుడు ఇవే విషయాలపై మెగా కాంపౌండ్‌లో చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కునే విషయంలో వైఎస్‌ల రాజసానికి, నారా వారి నక్క తెలివితేటలకు హస్తిమశకాంతం తేడా ఉన్నదని పవన్ కళ్యాణే స్వయంగా ఒక సీనియర్ జర్నలిస్ట్‌తో ఆగ్రహంగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -