ఆత్మీయులు,మనను అభిమానించే వాల్లు చనిపోతే ఆబాధ ఎలా ఉంటాదనేది చెప్పలేని సత్యం.నిత్యం వారి జ్నాపకాలు మనల్ను వెంటాడుతుంటాయి.చినిపోయిన వాల్లు మనతో మాట్లారని తెలిసినాకూడా మనం వాల్లను మరిచపోలేం.కనీసం ఒక్కసారైనా మళ్లీ వాళ్లు మనతో మాట్లాడితే బాగుండనిపిస్తుంది.అలాంటి వారికోసమే జపాన్‌లో టెలిఫోన్ బూత్ ఉంది.అక్కడకు వెల్లి ఆపోన్‌తో చనిపోయిన తమ ఆత్మీయులతో మాట్లాడుతుంటారు జపాన్ వాసులు.
2011లో ఉత్తర జపాన్‌లో సునామీ.. భూకంపం సంభవించి…రూ. లక్షల కోట్ల ఆస్తి నష్టం కలిగింది. 15వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రజలు మాత్రం వాళ్ల ఆత్మీయుల్ని కోల్పోయామన్న బాధలో ఉండిపోయారు. అయితే అంతకు ముందు ఏడాది ఇటరు ససకీ అనే వ్యక్తి తన కజిన్ మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కజిన్‌తో మాట్లాడాలని తపించేవాడు.
మనసులో ఆలోచన రావడంతో పసిఫిక్ సముద్రానికి అభిముఖంగా కొండపైన ఓ టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అందులోని ఫోన్‌కి ఎలాంటి కమ్యూనికేషన్ కనెక్షన్ లేదు. కేవలం ఫోన్ పట్టుకొని తన కజిన్‌కు చెప్పాలనుకున్నదంతా చెప్పేసి మనసులో భారం.. బాధ దింపేసుకునేవాడు. ఇలా కొంత కాలం తాను ఒక్కడే ఆ బూత్‌లో తన కజిన్‌తో మాట్లాడేవాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఆత్మీయుల్ని కోల్పోయిన అక్కడి ప్రజలకు ఈ విషయం తెలిసి చనిపోయిన తమ ఆత్మీయులతో మాట్లాడవచ్చని.. అక్కడికి రావడం మొదలుపెట్టారు. నిజంగా ఆ ఫోన్‌లో చనిపోయిన వారు మాట్లాడరు. కేవలం వారు చెప్పుకోవాల్సింది అందులో చెప్పుకుంటే.. ఆ మాటలు గాలి ద్వారా చేరాల్సిన వ్యక్తికి చేరుతాయని ఓ నమ్మకం ఏర్పరుచుకున్నారు. అందుకే ఈ టెలిఫోన్ బూత్‌ని ‘ఫోన్ ఆఫ్ ది విండ్’గా పిలుస్తున్నారు.
ఫోన్‌లో ఏం వినిపించకపోయినా.. జవాబు రాకపోయినా మనసుతోనే మాట్లాడగలగొచ్చని.. తాము చెప్పింది వాళ్లు వింటారని నమ్ముతున్నారు. ఇదండి చనిపోయిన వారితో మాట్లాడె టెలిపోన్ స్టోరీ
Also read