భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీరును తప్పుపట్టింది కర్ణాటక న్యాయస్థానం. ధోనీ కేవలం డబ్బు సంపాదన కోసమే ప్రాధాన్యతను ఇస్తున్నాడని..
ధోనీ మాత్రమే గాక ఇలాంటి సెలబ్రిటీల తీరు అంతా ఇలాగే ఉందని.. వీరు డబ్బు యావలో ఏం చేస్తున్నారో కూడా తెలీయకుండా బిహేవ్ చేస్తున్నారని కూడా కోర్టు వ్యాఖ్యానించడం విశేషం.
మహేంద్ర సింగ్ ధోనీని విష్ణుమూర్తిగా చిత్రీకరిస్తూ ఒక మ్యాగ్జిన్ పై ప్రచురితమైన బొమ్మకు సంబంధించిన వివాదంలో నమోదైన కేసులో విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేసింది. ధోనీ తీరును తప్పుపట్టింది. డబ్బు యావలో సెలబ్రిటీలు యాడ్ మేకర్లతో ఒప్పందాలు కుదుర్చుకొంటున్నారని.. ఆ ఒప్పందాలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొత్తానికి టీమిండియా కెప్టెన్ కు కోర్టు నుంచి ఈ విధమైన అక్షింతలు పడ్డాయి. తీవ్రమైన వ్యాఖ్యానాలతోనే కోర్టు ధోనీ తీరును తప్పుపట్టింది.
అయితే ధోనీని విష్ణుమూర్తిగా చిత్రీకరించిన ఆ కవర్ పేజీ కి గానూ ధోనీ డబ్బు తీసుకోలేదని అతడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ మేరకు అఫిడవిట్ ను దాఖలు చేయాలని న్యాయమూర్తి ధోనీ తరపు న్యాయవాదిని ఆదేశించారు.