తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన గురించి అందరికీ తెలిసిందే. భారీ తనం బాగా అలవాటు అయిన కెసిఆర్ ఒక పక్క ఆర్దిన పరిస్థితి తలకిందులు అవుతూ ఉంటే బంగారు తెలంగాణా ఎలా సాధ్యం అనే ఆలోచనలో ఉన్నారు. ఇకనుంచి ఏవిధమైన కార్యాచరణతో ముందుకు సాగాలన్న దానిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది.
రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది ప్రజానీకం బడుగు – బలహీన వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఈ కోణంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ రంగానికి దాదాపు రూ.29 వేల కోట్లు ఖర్చు పెడుతూ వచ్చింది. మెజారిటీ ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మునుపటి మాదిరిగానే కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై కోత పెట్టేలా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకుంటోంది.
ఎలాంటి విజన్ తో ముందుకు వెళితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సేఫ్ గా ఉంటుంది అనేది కెసిఆర్ ఆలోచిస్తున్నారు. దీని కోసం ఆర్థికశాఖ అధికారులు – నిపుణలు – ఆర్థిక సలహాదారులు కసరత్తు చేస్తున్నారు. మారనున్న ప్రభుత్వ ప్రాధాన్యతలు వచ్చే బడ్జెట్ లో ప్రతిబింబించేలా చూసేందుకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం.