దున్నపోతులు సాదారనంగా వేలు లక్షల్లో ఉండటాన్ని ఇప్పటి వరకు మనం చూశాం.ఇప్పుడు మీరు చూస్తున్న దున్నపోతులందు ఈ దున్నపోతులు వేరయా. దీని ఖరీదు వింటే దిమ్మతిరగి మైండ్ బ్లాక్ అవుతుంది.దున్న పోతు ఏంది ఇంత ఖరీదు అంటుకున్నారా …! మీరు విన్నది నిజమే.
యువరాజ్, సుల్తాన్ అని పిలిచే ఈ దున్నపోతులు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు కోటాలో జరుగుతున్న ‘గ్లోబర్ రాజస్థాన్ అగ్రిటెక్ మీట్’లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హరియాణాకు చెందిన ఇద్దరు రైతులు దున్నపోతుల యజమానులు.మేలు జాతి పాడి గేదెల ఉత్పత్తికి ఉపయోగపడే ఈ దున్నపోతుల వీర్యానికి భారీ గిరాకి ఉంది.
గత ఏడాది యువరాజ్‌ను రూ.9 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు రాగా యజమాని కరంవీర్‌సింగ్ విక్రయించేందుకు సిద్ధపడలేదు. సుల్తాన్‌కు ఏకంగా రూ.21 కోట్లు ఇస్తానని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యవసాయదారుడు ముచ్చటపడగా యజమాని నరేష్ బెనివాల్ తిరస్కరించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
సుల్తాన్ ఒక్కో తడవకు సుమారు 6మిల్లీలీటర్ల వీర్యాన్ని ఇస్తుందని, శాస్త్రీయ పద్దతుల్లో పలుచగా చేసి 600 డోసులు తయారు చేస్తున్నట్లు యజమాని నరేష్ తెలిపారు. ఒక్కో డోసును రూ.250 చొప్పున చెల్లించి పాడి గేదెల రైతులు కొనుగోలు చేస్తారన్నారు. ఏడాదికి సుల్తాన్ 54వేల డోసులు, యువరాజ్ 45వేల డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}