Saturday, May 10, 2025
- Advertisement -

ఏపీలో ప‌ట్టాలెక్కిన మ‌రో వార‌స‌త్వం.. 

- Advertisement -
Ministry Nara Lokesh Babu..

తెలుగు రాష్ట్రాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాలు హాట్‌హాట్‌గామారాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కొడుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజకీయాల్లో ఓరేంజ్‌లో ఉన్నాడు.. నిన్న టి వ‌ర‌కు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఏపి సిఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరైపోయారు..

ఏపి శాసన మండలి సభ్యత్వం పొందారు.. పెద్దల సభలోకి అడుగు పెట్టిన ఈ యువ నేతపైనే ఇప్పడు అందరి చూపు నిలిచింది. పంచాయితీ రాజ్ శాఖ‌ను లోకేష్‌కు కేటాయించారు. ఎట్ట‌కేల‌కు  పార్టీ నాయ‌కులు,కార్య‌క‌ర్త‌ల క‌ల సాకారామ‌య్యింది. అయితే అన్నీ బాగానే ఉన్నాఏపీలో ప్ర‌తిప‌క్ష‌పార్టీనేత జ‌గ‌న్ లాగా రాజ‌కీయాల్లో రానిస్తారా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వార‌సుడిగా రంగ‌ప్ర‌వేశం చేసిన జ‌గ‌న్ తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన ప‌రినామాల‌తో  సొంత‌పార్టీ  పెట్టి  సొంతంగా ఎమ్మెల్యేల‌ను గెలిపింఉకున్న క‌లేజా జ‌గ‌న్‌కు ఉంది. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో స‌మైక్యానికే మ‌ద్ద‌తు తెలిపిన జ‌గ‌న్ 2014 జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పార్టీగా అవ‌త‌రించింది. లోకేష్ కంటే మందుగానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్ మొదటిసారిగా ఎంపీగా భారీ మెజారిటీ సాధించారు. ఎంపీగా ప‌నిచేసిన అనుభ‌వం జ‌గ‌న్‌కు ఉంది. రాజ‌కీయాల‌ను  బాగానే ఒంటపట్టించుకున్నారు. ప్ర‌తిప‌క్ష‌పార్టీఅధినేత‌గా  రాష్ట్రంలో ప్ర‌జాస‌మ‌స్య‌లపట్ల చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానంగా  ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా, ప్ర‌త్యేక రైల్వేజోన్ ,రాజ‌ధాని నిర్మ‌నం అంశాల‌లో జ‌గ‌న్  దూసుకుపోతున్నాడు. ఇక అసెంబ్లీలో  ప్ర‌జాస‌మ‌స్య‌ల‌మీద జ‌గ‌న్ దూకుడు చెప్పాల్సిన ప‌నిలేదు.30 సంవ‌త్స‌రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు గట్టిగానే బ‌దులు ఇస్తున్నారు. ఇన్ని రాజ‌కీయ అనుకూల‌త‌లు ఉన్న జ‌గ‌న్ కు గట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌డా అన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్ర‌శ్న‌.        

ఇక లోకేష్  చంద్రబాబు ఏకైక తనయుడుగా… లోకేష్ కి తండ్రి రాజకీయ చతురత, వ్యూహం, ఎత్తుగడలు వంటబడతాయా అన్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయాల్లో పూర్తిగా అనుభ‌వం లేక‌పోయినా కొంత‌వ‌ర‌కు అనుభ‌వం ఉంది. ఇక‌ శాసన మండలిలోకి ఎంటరైన అతి పిన్న వయస్కుడు..  లోకేశ్ పార్టీ లో క్రియాశీలకంగా ఉంటున్నా.. చట్టసభలకు, మంత్రివర్గానికీ ఆయన కొత్త.. ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న లోకేశ్ కు హెరిటేజ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన అర్హత ఉంది. మొన్నటి ఎన్నికల ప్రచారంలో చినబాబు చురుగ్గానే పాల్గొన్నారు.. అభ్యర్ధుల ఎంపిక.. వారి పనితీరును గమనించడమే కాదు.. పార్టీ పరంగా వివాదాలను పరిష్కరించడం.. నేతలతో తరచుగా సమావేశాలు నిర్వహించడం లాంటి వన్నీ లోకేశ్ కు కొట్టిన పిండే.. తెలుగు దేశంలోకి యువతను ఎక్కువగా చేర్చాలన్న లక్ష్యంతో సైకిల్ యాత్ర కూడా చేపట్టారు.. కేబినెట్ విస్తరణ సందర్భంగా టిడిపి నేతలు చినబాబును కలిసేందుకు క్యూ కడుతున్నారంటేనే పార్టీలో లోకేష్ పవర్ ఏంటో తెలుస్తుంది.

తెలుగు రాస్ట్రాల్లో వార‌స‌త్వ రాజ‌కీయం  రస‌వ‌త్త‌రంగా మార‌నుంది. రాజ‌కీయాల్లో అనుభ‌వం ఉన్న జ‌గ‌న్‌ను తట్టుకొనే స‌త్తా లోకేష్‌కు ఉందా అన్న‌ది ఇప్పుడు  అంద‌రి ఆలోచ‌న‌. పెద్ద‌గా రాజ‌కీయ అనుభ‌వం లేని లోకేష్   జ‌గ‌న్ కు గ‌ట్టి పోటీ ఇచ్చి తండ్రిబాట‌లో ఎంత‌వ‌ర‌కు న‌డుస్తార‌నేది కాల‌మే నిర్న‌యించాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -